SIIMA Awards 2022: 'సైమా' అవార్డుల‌కు అత్య‌ధిక విభాగాల్లో పోటీ ప‌డుతున్న తెలుగు సినిమాలు

Updated on Aug 20, 2022 06:37 PM IST
SIIMA Awards 2022: ద‌క్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా. ఈ ఏడాది సైమా వేడుక‌లను బెంగళూరులో జరపనున్నారు.
SIIMA Awards 2022: ద‌క్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా. ఈ ఏడాది సైమా వేడుక‌లను బెంగళూరులో జరపనున్నారు.

SIIMA Awards 2022: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2022 నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభ‌మైంది. 2021వ సంవ‌త్స‌రంలో విడుద‌లైన చిత్రాల‌కు సంబంధించిన ప‌లు అవార్డుల‌కు ఎంపిక మొద‌లైంది. ఉత్త‌మ చిత్రాలు, ఉత్త‌మ న‌టీ న‌టులు వంటి ఎన్నో కేట‌గిరీల‌కు చెందిన అవార్డులకు నామినేష‌న్లు జ‌రిగాయి. ఈ సారి తెలుగు సినిమాలు సైమా 2022 నామినేషన్స్‌లో స‌త్తా చాటాయి. అత్య‌ధిక విభాగాల్లో తెలుగు చిత్రాలు పోటీ ప‌డుతున్నాయి.

ఆరుగురు హీరోల మ‌ధ్య పోటీ
సైమా 2022 నామినేషన్స్‌కు పుష్ప, అఖండ, ఉప్పెన, జాతి రత్నాలు ఎంపిక‌య్యాయి. పుష్ప 12 విభాగాల్లో, అఖండ 10 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. ఇక‌ ఉప్పెన 8 విభాగాల్లో, జాతిరత్నాలు 8 విభాగాల్లో నామినేట్ కావ‌డం విశేషం. ఉత్త‌మ న‌టుడి కేట‌గిరీలో ఆరుగురు తెలుగు హీరోలు పోటీ ప‌డుతున్నారు. 

SIIMA Awards 2022: 'పుష్ప' చిత్ర హీరో అల్లు అర్జున్ (Allu Arjun), 'అఖండ' చిత్రం నుంచి  బాల‌కృష్ణ (Balakrishna), 'లవ్ స్టోరీ' హీరో నాగ చైతన్య, 'నాంది' చిత్రంలోని నటనకు అల్లరి నరేష్, 'శ్యామ్ సింగరాయ్' చిత్రం నుంచి నాని, 'జాతి రత్నాలు' నుంచి నవీన్ పోలిశెట్టి నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురిలో ఉత్త‌మ న‌టుడి ఒక‌రు సైమా అందుకోనున్నారు. 

ద‌క్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా. ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కు మాత్ర‌మే సైమా అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తారు. ఈ ఏడాది సైమా వేడుక‌లను సెప్టెంబర్‌ 10,11 తేదీలలో బెంగళూరులో జరపనున్నారు. ఈ నేపథ్యంలో సైమాకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను విడుదల చేశారు.

సైమా అవార్డులకు నామినేట్‌ అయిన ద‌క్షిణాది సినిమాలు-

టాలీవుడ్‌

 • పుష్ప(అల్లు అర్జున్‌) : 12
 • అఖండ(బాలకృష్ణ): 10
 • జాతిరత్నాలు(నవీన్‌ పొలిశెట్టి): 8
 • ఉప్పెన(వైష్ణవ్‌ తేజ్‌):8

కోలీవుడ్‌

 • కర్ణన్‌(ధనుష్‌): 10
 • డాక్టర్‌(శివ కార్తికేయన్‌): 9
 • మాస్టర్‌(విజయ్‌): 7
 • తలైవి(కంగనా రనౌత్‌): 7

మాలీవుడ్‌

 • మిన్నల్‌ మురళీ(టోవినో థామస్‌): 10
 • కురుప్‌(దుల్కర్‌ సల్మాన్‌):8
 • మాలిక్‌(ఫహద్‌ పాజిల్‌):6
 • జోజీ(ఫహద్‌ ఫాజిల్‌):6

శాండల్‌వుడ్‌ 

 • రాబర్ట్‌(దర్శన్‌):10
 • గరుడ గమన వృషభ వాహన(రాజ్‌ బి.శెట్టి): 8
 • యువరత్న(పునీత్‌ రాజ్‌కుమార్‌): 7

Read More : 68th National Film Awards: జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న - ఉత్త‌మ తెలుగు చిత్రంగా ఎంపికైన 'క‌ల‌ర్ ఫోటో' !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!