Laal Singh Chaddha: 'లాల్ సింగ్ చద్దా' తెలుగు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పానీపూరి తినిపించుకున్న చిరంజీవి, అమీర్

Updated on Jul 25, 2022 05:39 PM IST
నాగ చైతన్య, అమీర్ ఖాన్ (Aamir Khan), చిరంజీవికి (Chiranjeevi) పానీపూరి ఇవ్వగా చిరు, అమీర్ ఒకరికొకరు పానీపూరి తినిపించుకున్నారు.
నాగ చైతన్య, అమీర్ ఖాన్ (Aamir Khan), చిరంజీవికి (Chiranjeevi) పానీపూరి ఇవ్వగా చిరు, అమీర్ ఒకరికొకరు పానీపూరి తినిపించుకున్నారు.

Laal Singh Chaddha: బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్ ఖాన్ హీరోగా, అక్కినేని నాగ చైతన్య ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా 'లాల్ సింగ్ చద్దా'. డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో అమిర్‌ ఖాన్‌ కు జోడిగా కరీనా కపూర్‌ నటించారు. కాగా, ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన 'లాల్ సింగ్ చడ్డా' ట్రైలర్‌, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో, ప్రమోషన్స్‌లో  వేగం పెంచారు మేకర్స్. అందులో భాగంగా ఆదివారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితోపాటు అమీర్ ఖాన్, నాగ చైతన్య పాల్గొన్నారు. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్నారు. 
 
‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ట్రైలర్‌ విడుదల చేసిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గొప్ప నటుడు అనిపించుకున్నారు అమిర్‌ఖాన్ (Aamir Khan). ఆయన నడక, నడవడిక నాకు ఎంతో ఇష్టం. ఆమిర్‌లాగే మేమూ నటించాలనుకుంటాం. కానీ, మాకున్న పరిమితుల వల్ల కుదరడం లేదు. ఆమిర్‌ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయనపై ఉన్న ప్రేమ, బాధ్యతతో ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నాను. తొందరపడి ఈ సినిమా విడుదలకు ఒప్పుకోలేదు. సినిమాను విడుదల చేస్తున్నందుకు గర్వపడుతున్నాను’ అని అన్నారు చిరంజీవి. 

‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha) సినిమా ట్రైలర్ లో హీరో పానీపూరి తినే ఒక సీన్ ఉంటుంది. ప్రెస్ మీట్ లో ట్రైలర్ ప్లే చేసిన తర్వాత ఈవెంట్ నిర్వాహకులు స్టేజిపై ఉన్న నాగ చైతన్య, అమీర్ ఖాన్, చిరంజీవికి పానీపూరి ఇవ్వగా చిరు, అమీర్ ఒకరికొకరు పానీపూరి తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అయితే ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పానీ పూరి ఎందుకు.. జిలేబి తినాల్సిందని కామెంట్లు పెట్టారు. మరికొందరేమో హీరోయిన్ లేదు కాబట్టి సరిపోయింది. అదే హీరోయిన్ ఉంటే.. ‘ భయ్యా తోడా ప్యాజ్ దాలో’ అంటుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య (Naga Chaitanya), అమీర్ ఖాన్ సమక్షంలో ఈ సినిమా ప్రివ్యూ నిర్వహించారు. 

Read More: 'లాల్ సింగ్ చద్దా' తెలుగు ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఏమన్నాడంటే..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!