'కార్తికేయ-3' (Karthikeya 3) 3Dలో రిలీజ్ చేస్తాం.. హీరో నిఖిల్ (Nikhil Siddarth) ఆసక్తికర అప్ డేట్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Hero Nikhil) నటించిన తాజా సినిమా ‘కార్తికేయ-2’ (Karthikeya 2) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా గత నెలలో విడుదల అయిన ఈ సినిమాలో నిఖిల్ కు జంటగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించారు. ఈ చిన్న సినిమా పాన్ ఇండియా లెవెల్లో సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
బాలీవుడ్ లో నామమాత్రంగా రిలీజైన 'కార్తికేయ 2' (Karthikeya 2) రూ.30కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. విడుదలైన నెల రోజుల తర్వాత కూడా థియేటర్లు హౌస్ ఫుల్స్‌తో రన్ అవడం అంటే మామూలు విషయం కాదు. అందుకు కారణం ఈ సినిమా శ్రీ కృష్ణుడి మీద రావడం. దీంతో ఈ సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే రూ.120 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. అయితే, ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా రానుంది అనే విషయం తెలిసిందే.
దర్శకుడు చందూ మొండేటి ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిఖిల్, 'కార్తికేయ-3' (Karthikeya 3) సినిమాపై ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు. కార్తికేయ-3 చిత్రాన్ని మరింత భారీ బడ్జెట్‌తో, భారీ క్యాస్టింగ్‌తో పాన్ వరల్డ్ మూవీగా తీయబోతున్నామని తెలిపారు. ఇక, ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు.
అంతేకాకుండా 'కార్తికేయ-3' (Karthikeya 3 Movie in 3D) సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తామని నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన ఇంకా చాలా విషయంలో త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం అని చెప్పాడు. ఇక, ఈ వార్తతో కార్తికేయ-3 సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
అయితే, 'కార్తికేయ 2' (Karthikeya 2) మలయాళం వెర్షన్ నేడు కేరళలోని థియేటర్లలో విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలెట్‌గా నిలిచింది.