'కార్తికేయ 2' (Karthikeya 2) సినిమాపై గుజరాత్ సీఎం ప్రశంసలు జల్లు.. కృష్ణతత్వం ఆవశ్యకతపై అభినందించిన సీఎం
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ 'కార్తికేయ 2' (Karthikeya 2) కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా రూ.100 కోట్లను కొల్లగొట్టింది. దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది.
కాగా, 'కార్తికేయ 2' (Karthikeya 2) సినిమా హిందీ వెర్షన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచి భారీ కలెక్షన్లను రాబట్టింది. రోజు రోజుకు స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ పోతూ.. 'కార్తికేయ 2' కలెక్షన్ల మోత మోగిస్తోంది. కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్నాక, ద్వారక నగరంలో కొన్ని అద్భుత రహస్యాలను చేధించే ఓ యువకుడి సాహస గాథే ఈ సినిమా. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ 'కార్తికేయ 2' మంచి వసూళ్లను రాబడుతుంది.
అయితే, ఈ సినిమా ఇటీవలే వసూళ్ళలో వంద కోట్ల రూపాయల మార్క్‌ను దాటింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అభిమానుల మధ్య సక్సెస్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. కర్నూలులో ఆగస్టు 26వ తేదిన నిర్మాతలు సక్సెస్ పార్టీని నిర్వహించారు.
'కార్తికేయ 2' సినిమాపై ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ (CM Bhupendrabhai Patel) ప్రశంసల జల్లు కురిపించారు. స్క్రీన్‌పై కృష్ణతత్వం ఆవశ్యకతను చూపించేందుకు చిత్రబృందం చేసిన కృషిని ఆయన అభినందించారు. కాగా, ఈ సినిమాలో ఎక్కువ భాగం గుజరాత్‌లోనే చిత్రీకరించిన సంగతి తెలిసిందే.
'కార్తికేయ 2' (Karthikeya 2) చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్యమీనన్ కీలక పాత్రల్లో నటించారు. కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ధన్వంతరి పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు.
Read More: Karthikeya 2: 'కార్తికేయ 2' సక్సెస్ సంబురాలు... గర్వంగా ఉందన్న హీరో నిఖిల్(Nikhil Siddhartha)