Karthikeya 2: వంద‌ కోట్ల క్లబ్‌లో 'కార్తికేయ 2'.. క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం అంటున్న నిఖిల్ (Nikhil Siddhartha) 

Updated on Aug 27, 2022 01:02 PM IST
Karthikeya 2: నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)కు కార్తికేయ 2 సినిమా భారీ స‌క్సెస్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా వంద కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లు చేసింది.
Karthikeya 2: నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)కు కార్తికేయ 2 సినిమా భారీ స‌క్సెస్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా వంద కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లు చేసింది.

Karthikeya 2: టాలీవుడ్ హీరో  నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) న‌టించిన మైథలాజికల్ థ్రిల్లర్ 'కార్తికేయ 2' కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 100 కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. ద‌ర్శ‌కుడు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో, ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో విడుదలైంది. సినిమా హిందీ వ‌ర్ష‌న్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుద‌లైన తొలి రోజు నుంచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. రోజు రోజుకు స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ పోతూ.. 'కార్తికేయ 2' క‌లెక్ష‌న్ల మోత మోగిస్తోంది.

వసూళ్ల పండుగ‌

నిఖిల్ సిద్ధార్థకు 'కార్తికేయ 2' (Karthikeya 2) సినిమా భారీ స‌క్సెస్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఈ రోజుతో  వసూళ్ళలో వంద కోట్ల రూపాయ‌ల‌ మార్క్‌ను దాటింది. 

కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్నాక, ద్వారక నగరంలో కొన్ని అద్భుత రహస్యాలను చేధించే ఓ యువకుడి సాహస గాథే ఈ సినిమా. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ 'కార్తికేయ 2' మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది.

ఈ చిత్రం రూ. 100 కోట్లు వ‌సూళ్లు చేయ‌డంతో, చిత్ర యూనిట్ సంతోషం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో అభిమానుల మ‌ధ్య స‌క్సెస్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. క‌ర్నూలులో ఆగ‌స్టు 26 తేదిన నిర్మాతలు స‌క్సెస్ పార్టీని నిర్వ‌హించ‌నున్నారు. 

'పుష్ప' త‌ర్వాత ఆ రేంజ్‌లో 'కార్తికేయ 2' సినిమాకు నార్త్‌లో డిమాండ్ ఏర్ప‌డింది. నిఖిల్‌కు జోడిగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ న‌టించారు. ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ నటించి మెప్పించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

Read More: Karthikeya 2: 'కార్తికేయ 2' వ‌సూళ్లు మాములుగా లేవుగా!.. 100 కోట్లను కొల్ల‌గొట్ట‌నున్న నిఖిల్ సినిమా!!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!