'కార్తికేయ 3' (Karthikeya3) చేయకపోతే మా అమ్మ నన్ను వదలదు.. హీరో నిఖిల్ (Nikhil Siddhartha) ఆసక్తికర వ్యాఖ్యలు!

Updated on Oct 17, 2022 03:48 PM IST
నేను ఎక్కడికి వెళ్లినా ‘కార్తికేయ2’ (Karthikeya 2) ఎప్పుడు తీస్తారు అని అడిగే వాళ్లు. ప్రేక్షకులు ఆ సినిమాను అంతగా కోరుకున్నారు.
నేను ఎక్కడికి వెళ్లినా ‘కార్తికేయ2’ (Karthikeya 2) ఎప్పుడు తీస్తారు అని అడిగే వాళ్లు. ప్రేక్షకులు ఆ సినిమాను అంతగా కోరుకున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddhartha). చందు మొండేటి దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). ఈ చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు ఆకర్షించాడు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

కాగా, నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా 'కార్తికేయ', 'కార్తికేయ 2' కనిపిస్తాయి. ఈ రెండు సినిమాలకి కూడా చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహించాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తదితరులు నటించారు. 

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

అయితే.. 'కార్తికేయ 2' (Karthikeya 2) సినిమాతో నిఖిల్ కి ప్రత్యేకంగా బాలీవుడ్ లో మంచి మార్కెట్ కూడా క్రియేట్ అయ్యింది. దీంతో 'కార్తికేయ 3' సినిమాపై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. అయితే ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ 'కార్తికేయ 3' సినిమాపై నిఖిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

‘కార్తికేయ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు దానికి సీక్వెల్‌ తెరకెక్కించాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ.. నేను ఎక్కడికి వెళ్లినా ‘కార్తికేయ 2’ ఎప్పుడు తీస్తారు అని అడిగే వాళ్లు. ప్రేక్షకులు ఆ సినిమాను అంతగా కోరుకున్నారు. ఇప్పుడు 'కార్తికేయ 3' (Karthikeya 2 Sequel) గురించి కూడా అలానే అడుగుతున్నారు. ఒకవేళ నేను 'కార్తికేయ 3' చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ మా అమ్మ మాత్రం నన్ను వదలదు. అమ్మ కోసం అయినా ఆ సినిమా చేయాలి’ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో సినిమా అతి తర్వలోనే ప్రారంభం కానుంది అని పేర్కొన్నాడు.

దీంతో ఈ విషయంపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో 'కార్తికేయ' కథ కొనసాగితే, ద్వారక నేపథ్యంలో 'కార్తికేయ 2' కథ కొనసాగింది. ఇక 'కార్తికేయ 3' కథ అంతా కూడా అయోధ్య (Ayodhya) నేపథ్యంలో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సారి కథ శ్రీరాముడికి సంబంధించిన రహస్యాలతో నడుస్తుందన్న మాట. మరి, త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Read More: 'కార్తికేయ-3' (Karthikeya 3) 3Dలో రిలీజ్ చేస్తాం.. హీరో నిఖిల్ (Nikhil Siddarth) ఆసక్తికర అప్ డేట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!