'బింబిసార' (Bimbisara) సక్సెస్ తర్వాత ఆసక్తికరంగా కళ్యాణ్ రామ్ (Kalyanram) తర్వాతి సినిమా.. షూటింగ్ పూర్తి!

Updated on Oct 13, 2022 12:28 PM IST
క‌ల్యాణ్ రామ్ (NandamuriKalyanram) ఈ సినిమాతో పాటు అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌లో నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' సినిమా కూడా చేస్తున్నాడు.
క‌ల్యాణ్ రామ్ (NandamuriKalyanram) ఈ సినిమాతో పాటు అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌లో నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' సినిమా కూడా చేస్తున్నాడు.

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ఇటీవల 'బింబిసార' (Bimbisara) సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 19వ చిత్రం సెట్స్ మీద ఉంది. 

కాగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నీని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. 

ఇదిలా ఉంటే.. ఈ హీరో తాజాగా అంద‌రికీ స‌ర్‌ప్రైజ్ ఇస్తూ తన కొత్త సినిమా అప్‌డేట్ అందించాడు. NKR19గా వ‌స్తున్న ఈ ప్రాజెక్టు అప్‌డేట్ అందించింది క‌ల్యాణ్ రామ్ టీం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్. ఈ పోస్ట‌ర్‌లో కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్.సౌందర రాజన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. 

క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ఈ సినిమాతో పాటు అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌లో నవీన్ మేడారం డైరెక్ష‌న్‌లో 'డెవిల్' అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. 'ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం వ‌స్తుండ‌గా… ఇప్ప‌టికే విడుద‌లైన‌ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది.

Read More: Bimbisara 2: 'బింబిసార 2 లో విల‌న్ ఎవ‌రంటే!. డ‌బుల్ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!