Bimbisara Rap Song: కల్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన 'బింబిసార' నుంచి సర్‌ప్రైజ్.. అదరగొడుతున్న ర్యాప్ సాంగ్!

Updated on Aug 09, 2022 07:44 PM IST
'బింబిసార' నుంచి బ్లాస్టింగ్ రేంజ్ లో సాగే ర్యాప్ సాంగ్ ని (Bimbisara Rap Song) యూట్యూబ్ లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
'బింబిసార' నుంచి బ్లాస్టింగ్ రేంజ్ లో సాగే ర్యాప్ సాంగ్ ని (Bimbisara Rap Song) యూట్యూబ్ లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన తాజా సినిమా 'బింబిసార' (Bimbisara) పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. 

ఇక 'బింబిసార' చిత్రం క‌ళ్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను తీసుకొచ్చింది. కేవ‌లం రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ.13 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్‌ల‌ను సాధించింది. ఆదివారంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని, లాభాల బాట ప‌ట్ట‌నుంది. ఇక, ఈ చిత్రంలో బింబిసారుడిగా కళ్యాణ్‌రామ్ న‌ట‌న వ‌ర్ణ‌నాతీతం. ఆయన స్క్రీన్ ప్ర‌జెన్స్‌, డైలాగ్ డెలివ‌రీ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకున్నాయి.

తెలుగులో టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలు చాలా తక్కువ. అలా నూతన కథాంశంతో ఏ సినిమా వచ్చినా, ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే 'బింబిసార' (Bimbisara Movie) మూవీ తెరకెక్కింది. టైమ్ ట్రావెల్ కథకు కాస్త పీరియాడిక్ డ్రామా జోడించి, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది మూవీ టీమ్. దీంతో ఆడియన్స్ అంతా ఈ మూవీకి ఫిదా అయిపోతున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా 'బింబిసార' చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీ నుండి బ్లాస్టింగ్ రేంజ్ లో సాగే ర్యాప్ సాంగ్ ని (Bimbisara Rap Song) యూట్యూబ్ లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ర్యాప్ వర్షన్‌తో ఈ పాట రాగా, ఇందులో సినిమాలో పలు కీలక సన్నివేశాలను చూపించారు. ట్రెండీ స్టైల్ లో సాగే ఈ పాటని సింగర్స్ లిప్సిక, ఆదిత్య అయ్యంగార్, పృథ్వీ చంద్ర అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ ర్యాప్ సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. 

Read More: Bimbisara: 'బింబిసార' సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటనపై అల్లు అర్జున్ (Allu Arjun) కామెంట్లు.. ట్వీట్ వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!