(Bimbisara) ‘బింబిసార’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

Updated on Oct 06, 2022 03:17 PM IST
కల్యాణ్​ రామ్ (Kalyanram Nandamuri) నటించిన ‘బింబిసార’ (Bimbisara) బంపర్ హిట్టవ్వడంతో సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి
కల్యాణ్​ రామ్ (Kalyanram Nandamuri) నటించిన ‘బింబిసార’ (Bimbisara) బంపర్ హిట్టవ్వడంతో సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి

నందమూరి హీరో కల్యాణ్​ రామ్ (Kalyanram Nandamuri) నటించిన ‘బింబిసార’ (Bimbisara) చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ‘బింబిసార’ బంపర్ హిట్‌గా నిలిచి కల్యాణ్​ రామ్‌లో సరికొత్త జోష్‌ను నింపింది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 

అనుభవం లేని దర్శకుడ్ని నమ్మి.. భారీ బడ్జెట్‌తో సొంత బ్యానర్‌పై ‘బింబిసార’ను కల్యాణ్ రామ్ నిర్మించారు. ఒకరకంగా ఇది సాహసమనే చెప్పాలి. కానీ ఆయన కష్టం వృథా పోలేదు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆగస్ట్‌ 5న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ మూవీ.. మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్‌ను ఖాతాలో వేసుకుంది. 

థియేటర్లలో అలరించిన ‘బింబిసార’.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్‌ ప్లాట్‌ఫామ్ జీ5 సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీని జీ5 తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనుంది. థియేటర్లలో ‘బింబిసార’ మూవీని మిస్సయిన వారు, అలాగే ఈ సినిమాను మళ్లీ చూడాలనుకునే వారు దీపావళి వరకు ఆగితే ఓటీటీలో చూడొచ్చు. 

ఇకపోతే, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై వశిష్ఠ్‌ దర్శకత్వంలో ‘బింబిసార’ చిత్రం తెరకెక్కింది. క్యాథరీన్‌, సంయుక్త మీనన్‌లు ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రంలో కల్యాణ్‌ రామ్ తన నటనలో చాలా పరిణతి చూపించారు. డ్యుయెల్‌ రోల్‌ చేసిన కల్యాణ్‌ రామ్‌.. బింబిసారుడనే క్రూరమైన రాజు పాత్రలో అద్భుతమైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.    

‘బింబిసార’ చిత్రంలో వైవిధ్యమైన నటుడు ప్రకాష్ రాజ్‌తోపాటు వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి సీనియర్ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణీ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ‘బింబిసార-2’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. 

 Read more: Bimbisara: బింబిసార 2పై క్లారిటీ ఇచ్చిన‌ క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram).. పార్ట్ 2లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!