Bimbisara 2: 'బింబిసార 2 లో విల‌న్ ఎవ‌రంటే!. డ‌బుల్ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram)

Updated on Aug 30, 2022 04:28 PM IST
 'బింబిసార 2' సినిమాలో  క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) డ‌బుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.  ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించ‌నున్నారు.
'బింబిసార 2' సినిమాలో  క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) డ‌బుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.  ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించ‌నున్నారు.

Bimbisara: 'బింబిసార' సినిమాతో  క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram)  బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించారు. కొత్త ద‌ర్శ‌కుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాతో త‌న రేంజ్ పెంచుకున్నారు. బింబిసార భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఈ సినిమాకు సీక్వెల్స్ ఉంటాయ‌ని క‌ల్యాణ్ రామ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 'బింబిసార‌'కు సీక్వెల్‌గా మ‌రో మూడు సినిమాలు తెర‌కెక్కిస్తార‌ట‌. 'బింబిసార 2'లో విల‌న్‌గా ఓ స్టార్ హీరోయిన్ న‌టించ‌నున్నార‌ట. 

'బింబిసార' సీక్వెల్‌కు రెడీ!

'బింబిసార' (Bimbisara)కు సీక్వెల్‌గా 'బింబిసార 2' తెర‌కెక్క‌నుంది. ఈ సీక్వెల్‌కు స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా మొద‌లైంది. ద‌ర్శ‌కుడు మల్లిడి వశిష్ట 'బింబిసార‌ 2' స్క్రిప్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నారు. ఈ సినిమా బింబిసారుడి క్రూరమైన పాలన గురించి తెలియజేయనుంది.

'బింబిసార 2' సినిమాలో స్టార్ కాస్ట్ కూడా భారీగానే ఉంటుందని సమాచారం. 'బింబిసార‌'ను దాదాపు రూ. 40 కోట్ల‌తో నిర్మించారు. రెండో పార్టును డ‌బుల్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తార‌ట‌. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించ‌నున్నారు.

 'బింబిసార 2' సినిమాలో  క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) డ‌బుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.  ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించ‌నున్నారు.

లేడీ విల‌న్ పాత్ర కీల‌క‌మా!

'బింబిసార 2' సినిమాలో లేడీ విల‌న్ పాత్ర కీల‌కంగా ఉండ‌బోతుంది. లేడీ విల‌న్ పాత్ర కోసం ఓ ప్రముఖ హీరోయిన్‌ను వెతికే ప‌నిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. 'బింబిసార‌'లో హీరోయిన్ పాత్ర‌ల‌కు ద‌ర్శ‌కుడు అంత ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. సీక్వెల్‌లో హీరోతో పాటు హీరోయిన్ పాత్ర‌ను కూడా హైలెట్ చేయ‌నున్నార‌ట‌. 'బింబిసార 2' సినిమాలో  క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) డ‌బుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.

Read More: Bimbisara: బింబిసార 2పై క్లారిటీ ఇచ్చిన‌ క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram).. పార్ట్ 2లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారా?.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!