ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేది హీరో, హీరోయిన్ల కోసమే.. అల్లు అరవింద్‌ (Allu Aravind) కామెంట్స్ వైరల్ !

Updated on Jun 04, 2022 05:30 PM IST
‘పక్కా కమర్షియల్’  సినిమా ప్రెస్‌మీట్‌లో హీరో గోపీచంద్, హీరోయిన్ రాశీ ఖన్నాతో అల్లు అరవింద్ (Allu Aravind ) తదితరులు
‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రెస్‌మీట్‌లో హీరో గోపీచంద్, హీరోయిన్ రాశీ ఖన్నాతో అల్లు అరవింద్ (Allu Aravind ) తదితరులు

ప్రస్తుతం దేశంలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా మారింది. ఒకటి రెండు పెద్ద సినిమాలు మినహా.. మిగిలిన సినిమాలకు ఖర్చు చేసిన బడ్జెట్‌ తిరిగి రాబట్టుకునే పరిస్థితులు లేవు. ఇక, బాలీవుడ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఒకప్పుడు 100 కోట్ల రూపాయల వసూళ్లను సులువుగా రాబట్టిన బాలీవుడ్‌ హీరోలు.. ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడుతున్నారు.

ఇక, టాలీవుడ్‌లో సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నప్పటికీ.. టికెట్ల రేట్లు వాళ్లను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఓటీటీల ప్రాధాన్యత పెరగడం కూడా, థియేటర్లకు ప్రేక్షకులు దూరంగా ఉండడానికి కారణమే.

థియేటర్‌‌లో రిలీజై సూపర్ డూపర్ హిట్‌ టాక్ సొంతం చేసుకున్న సినిమాలను కూడా నాలుగు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో చాలా ఫ్యామిలీలు థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో సినిమా చూడొచ్చనే భావనలో ఉంటున్నారు. ఇంతటి దారుణ పరిస్ధితుల్లో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు నానా తంటాలు పడుతున్నారు. టికెట్‌ రేట్లను పెంచకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవలే వెంకటేష్, వరుణ్‌ తేజ్ హీరోలుగా రిలీజ్ అయిన సినిమా ఎఫ్‌ 3. ఈ సినిమాకు టికెట్‌ రేట్లు పెంచకుండా, థియేటర్లకు ప్రేక్షకులను తీసుకువచ్చేలా తనవంతు ప్రయత్నం చేశాడు దిల్‌ రాజు.

గోపీచంద్

ఆ బాధ్యత హీరోలదే..

దిల్‌ రాజు బాటలో నడిచేందుకు పలువురు నిర్మాతలు రెడీ అవుతున్నారు. దీనిపై ప్రముఖ నిర్మాత అల్లు  అరవింద్ (Allu Aravind) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేసే బాధ్యత హీరోలదేనని, సినిమా ప్రమోషన్స్‌లో హీరోలు పాల్గొనాలని అరవింద్ కోరారు.

Gopichand:  గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పక్కా కమర్షియల్’. తాజాగా  పక్కా కమర్షియల్‌ చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో అల్లు అరవింద్‌ ఈ కామెంట్స్‌ చేశాడు.

‘సినిమా ఫంక్షన్స్‌కు వెళ్లడానికి గోపీచంద్‌కు పెద్దగా ఇష్టపడడు. అతనికి సిగ్గు కూడా ఎక్కువే. ఈ మీడియా సమావేశానికి గోపీచంద్‌ని తప్పకుండా రప్పించండి అని చెప్పాను. ఇండస్ట్రీ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. సినిమా ప్రమోషన్స్‌కు హీరోలు కూడా రావాలి. ఈ మధ్య కాలంలో ఓ పెద్ద హీరో స్టేజ్‌ మీద డ్యాన్స్‌ చే,సి తన సినిమాను ప్రమోట్‌ చేసుకున్నాడు. అలా చేసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత హీరోలపైన కూడా ఉంది. ఈ మధ్య ఓటీటీలో చాలా కంటెంట్‌ అందుబాటులో ఉంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు ధియేటర్లకు రావాలంటే.. హీరో, హీరోయిన్లు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని ప్రచారం చేయాలి. ఎన్ని ఫంక్షన్స్‌ ఉన్నా హీరో, హీరోయిన్లు వచ్చి తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోవాలి. నిర్మాతలను చూసి ప్రేక్షకులు థియేటర్లకు రారు. హీరో హీరోయిన్లను చూసే వస్తారు’ అని అల్లు అరవింద్‌ అన్నాడు. 

హీరోయిన్ రాశీ ఖన్నా

ఆ కామెంట్స్ మహేష్‌బాబు గురించే..

ఇటీవలి కాలంలో ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ మీట్‌లో సూపర్‌‌స్టార్‌ మహేష్‌బాబు డాన్స్‌ చేశాడు. కర్నూలులో జరిగిన ఈ కార్యక్రమంలో మహేష్‌ స్టేజీపై ఫస్ట్‌ టైమ్‌ స్టెప్పులు వేసి, ఫ్యాన్స్‌ను అలరించాడు. ఈ క్రమంలో అల్లు అరవింద్‌ (Allu Aravind)  చేసిన కామెంట్స్‌ మహేష్‌బాబును ఉద్దేశించేనని తెలుస్తోంది.

Read More:  అందరూ తెలుసుకోవాల్సిన కథ.. ఇదే మహేష్ బాబు (Mahesh Babu) మదిలోని మాట 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!