Samantha Ruth Prabhu : సమంత లేటెస్ట్ ఫిల్మ్ "యశోద" చిత్రం టాప్ 10 విశేషాలు ! 

Updated on Nov 12, 2022 05:18 PM IST
Samantha Ruth Prabhu: సరోగసి ప్రక్రియ ద్వారా మరొకరి బిడ్డకు జన్మనిచ్చే తల్లి పాత్రలో సమంత 'యశోద' సినిమాలో నటించారు
Samantha Ruth Prabhu: సరోగసి ప్రక్రియ ద్వారా మరొకరి బిడ్డకు జన్మనిచ్చే తల్లి పాత్రలో సమంత 'యశోద' సినిమాలో నటించారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నటించిన 'యశోద' చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి పేరు యశోద. ఆ పేరునే టైటిల్‌గా పెట్టి చాలా ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నిర్మాతలు. సరోగసి ప్రక్రియ ద్వారా మరొకరి బిడ్డకు జన్మనిచ్చే తల్లి పాత్రలో సమంత 'యశోద' సినిమాలో నటించారు. సరికొత్త కథతో లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం రూపొందింది. దర్శక ద్వయం హరి, హరీష్‌లు ఈ చిత్రాన్ని మంచి నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు అందివ్వడం విశేషం. యశోద సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం.

సమంత (Samantha Ruth Prabhu)

 యశోద (Yashoda) సినిమా టాప్ 10 విశేషాలు

* పాన్ ఇండియా సినిమాగా 'యశోద' చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) సరోగసి ప్రక్రియ ద్వారా గర్భాన్ని ధరించి, వేరొకరికి బిడ్డకు జన్మనిచ్చే పాత్రలో నటించారు. ఇది పూర్తిగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా.

* అయితే ఈ సబ్జెక్టు మీద సినిమాలు రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా క్రాంతి కుమార్ దర్శకత్వంలో  సౌందర్య కథానాయికగా '9 నెలలు' .. అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'వెల్‌కమ్ ఒబామా' లాంటి సినిమాలు తెరకెక్కాయి. అలాగే ఓ 20 ఏళ్ల క్రితం అనితా చౌదరి కథానాయికగా దూరదర్శన్‌లో 'సుశీల' అనే ధారావాహికం కూడా ప్రసారమైంది. 

* 'యశోద'  సినిమాలో సమంత ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోరాట సన్నివేశాలను ప్రముఖ స్టంట్ మాస్టర్ వెంకట్ రూపొందించారు. అలాగే కొన్ని యాక్షన్ సీన్లను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్ మెన్  ఆధ్వర్యంలో తెరకెక్కించారు.

* శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మాత  శివలెంక కృష్ణప్రసాద్ 'యశోద' చిత్రాన్ని  నిర్మించారు. 'యశోద' సినిమాను దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. 

* ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. 

* యశోద' చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా ఎం. సుకుమార్ వ్యవహరించారు.  పులగం చిన్నారాయణ, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి సంభాషణలు వ్రాశారు

*  'యశోద' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. హిందీ, త‌మిళం, కన్నడం, మ‌ల‌యాళం భాష‌ల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. 

* 'యశోద' సినిమా విడుదలైన మొదటి రోజే రూ. 3.25 కోట్ల రూపాయలను వసూలు చేసింది. నైజాం, ఓవర్సీస్‌లలో ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్లను రాబట్టింది.

* వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో సమంతతో పోటా పోటీగా నటించారు. 

*  'యశోద' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'  దక్కించుకుంది. మరో మూడు లేదా నాలుగు వారాల్లో యశోద ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. 

Read More: Yashoda Movie Review : సమంత నటనా విశ్వరూపాన్ని చూపించిన "యశోద" !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!