Sai Pallavi: 'విరాటపర్వం' సినిమా ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఆసక్తికర పోస్ట్ చేసిన సాయిపల్లవి..!

Updated on Jul 02, 2022 06:36 PM IST
సాయిపల్లవి (Sai Pallavi)
సాయిపల్లవి (Sai Pallavi)

Sai Pallavi: నాచురల్ క్వీన్ సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు రానా దగ్గుబాటి  తెరపంచుకున్నారు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఈ సినిమా యూనిట్ అందరికి కూడా ఒక ప్రత్యేక ప్రయాణంగా నిలిచింది. 

విరాట పర్వం (Virata Parvam) సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. కాగా, ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా వాయిదాల పర్వం కొనసాగింది.  పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా చివరకు జూన్ 17న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆశించిన మేర ఈ మూవీ సక్సెస్ సాధించినప్పటికీ ఓ వర్గం ఆడియన్స్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్రపై మనసు పారేసుకున్నారు తెలుగు ఆడియన్స్.

విరాట పర్వం (Virata Parvam) చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో కామ్రేడ్‌ రవన్నగా రానా నటించగా.. వెన్నెలగా సాయి పల్లవి తన నాచురల్ నటనతో అట్రాక్ట్ చేసింది. ఆలోచింపజేసే సన్నివేశాలతో పాటు ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ సినిమాలో హైలైట్ అయింది. అయితే.. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే సినిమాను ఓటిటిలో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో జూలై 1 నుండి విరాట పర్వం స్ట్రీమింగ్ అవుతోంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తకర పోస్ట్ పెట్టింది. విరాట పర్వం లో తాను చేసిన వెన్నెల పాత్ర నేను ఇప్పుడు వరకు చేసిన పాత్రల్లో ఒక మరపురాని పాత్ర అని ఆ రోల్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నానని తాను తెలిపి విరాట పర్వం నెట్ ఫ్లిక్స్ లో (Netflix) స్ట్రీమ్ అవుతుంది అందరూ చూడాలని కోరింది. దీంతో పాటు తన పోస్ట్ లో.. చిత్రీకరణ సమయంలోని కొన్ని మేకింగ్ ఫొటోస్‌ని షేర్ చేసింది. 

1990లలో నక్సలైట్స్–పోలీసులు నేపథ్యంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెన్నెల పాత్రకుగాను సాయి పల్లవి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విడుదలకు ముందు ప్రమోషన్స్ (Virata Parvam Promotions) లో భాగంగా సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేయడంతో అప్పట్లో కాస్త వివాదం నెలకొంది. 

Read More: Virata Parvam OTT Release: ఓటీటీలోకి 'విరాట పర్వం'.. జులై 1 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!