పూజిత పొన్నాడ (Pujita Ponnada) ను రహస్యంగా వివాహం చేసుకున్న రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)..?

Updated on Sep 04, 2022 08:35 PM IST
సోషల్‌మీడియాలో కొన్నిసార్లు తనపై నెగెటివ్‌ కామెంట్స్‌ వస్తుంటాయని, వాటిని చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని పూజిత (Pujita Ponnada) అన్నారు
సోషల్‌మీడియాలో కొన్నిసార్లు తనపై నెగెటివ్‌ కామెంట్స్‌ వస్తుంటాయని, వాటిని చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని పూజిత (Pujita Ponnada) అన్నారు

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన అచ్చ తెలుగు నటి పూజిత పొన్నాడ (Pujita Ponnada) తనపై వస్తున్న కథనాల పట్ల స్పందించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో తన పెళ్లి సీక్రెట్ గా జరిగిందంటూ వస్తున్న కథనాలను పూజిత పొన్నాడ ఖండించింది. అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రం ద్వారా వెండితెర గుర్తింపు పొందిన పూజిత అచ్చమైన తెలుగింటి అమ్మాయే కావడం విశేషం.

గతంలో రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించిన పూజిత ప్రస్తుతం 'ఆకాశ వీధుల్లో' (Akasha Veedhullo) అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగానే దేవి శ్రీ ప్రసాద్ తోనే కాదు.. తనకు ఎవరితోనూ రిలేషిన్ షిప్ లేదని స్పష్టం చేసింది. 

నటి పూజిత పొన్నాడ (Actress Pujita Ponnada)

సోషల్‌మీడియాలో కొన్నిసార్లు తనపై నెగెటివ్‌ కామెంట్స్‌ వస్తుంటాయని.. వాటిని చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని ఆమె అన్నారు. ఇలాంటి కథనాలు ఎలా పుట్టిస్తారో అర్థం కాదని పూజిత పొన్నాడ వాపోయింది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) తో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దంటూ నెటిజన్లకు హితవు పలికింది.

నటి పూజిత 'రంగస్థలం' (RangaSthalam) సినిమాలో ఆది పినిశెట్టి ప్రియురాలి క్యారెక్టర్‌తో మంచి పేరు తెచ్చుకుంది. తరువాత 'కల్కి' మూవీలో రొమాంటిక్ లేడీ ఎస్‌ఐగా మోడరన్ లుక్స్‌లో ఆకట్టుకుంది. 'ఊపిరి', 'మిస్‌ ఇండియా', 'ఓదెల రైల్వేస్టేషన్‌' వంటి సినిమాల్లో నటించినా.. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. తాజాగా 'ఆకాశ వీధుల్లో' మూవీ ద్వారా ఆడియన్స్‌ ముందుకు వచ్చింది.

Read More: బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) గ్రాండ్ లాంఛింగ్ నేడే.. ప్రోమో వచ్చేసింది.. హౌస్ లోని కంటెస్టెంట్లు వీరే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!