బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) గ్రాండ్ లాంఛింగ్ నేడే.. ప్రోమో వచ్చేసింది.. హౌస్ లోని కంటెస్టెంట్లు వీరే

Updated on Sep 04, 2022 05:32 PM IST
తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు సంబంధించిన ప్రోమో (Biggboss 6 Promo) రిలీజ్ అయ్యింది.
తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు సంబంధించిన ప్రోమో (Biggboss 6 Promo) రిలీజ్ అయ్యింది.

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ (Telugu Biggboss) సందడి మొదలైంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యహరిస్తున్న బిగ్‌బాస్‌-6 గ్రాండ్‌ లాంఛింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. నిజానికి ఆగస్టు చివరి వారంలోనే ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల అది సెప్టెంబర్ తొలి వారానికి పోస్ట్ పోన్ అయ్యిందని టాక్. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు సంబంధించిన ప్రోమో (Biggboss 6 Promo) రిలీజ్ అయ్యింది.

ఈ ప్రోమోలో కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) ఎప్పటిలాగే మరింత ఎనర్జిటిక్‌గా కనిపించారు. రెట్టింపు ఉత్సాహంతో కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ హౌస్‌లోకి స్వాగతం పలికారు. అయితే, ప్రోమోలో సీజన్‌లోని కంటెస్టెంట్ల వివరాలను రివీల్‌ చేయలేదు గానీ కొందరు హౌస్‌మేట్స్‌ వాయిస్ లని మాత్రం ప్రోమోలో వినిపించారు.

ప్రోమోలోని వాయిస్ ఆధారంగా ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి (Chalaki Chanti) ఎంట్రీ ఇచ్చాడని స్పష్టమవుతోంది. 'సుర్రు సుమ్మయిపోద్ది' అంటూ గొంతు వినపడటంతో.. నెటిజన్లు.. చంటి షోలో ఎలా ఆడుతాడో చూడాలి అని కామెంట్లు పెడుతున్నారు. 

మరోవైపు టాలీవుడ్ ప్రముఖ సింగర్ రేవంత్ (Singer Revanth) వాయిస్ కూడా ప్రోమోలో వినిపించింది. నువ్వు సింగర్ కంటే ఎక్కువగా ప్లే బాయ్ అంటూ నాగ్ రేవంత్‌ను ఆటపట్టించే డైలాగ్స్ ప్రోమోలో మనం వినవచ్చు. దీంతో సింగర్ రేవంత్ కూడా ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తేలిపోయింది. 

అలాగే హౌస్‌లోకి వెళ్తున్న జోడీని కూడా ప్రోమోలో చూపించారు. ఇక ఈసారి కూడా హౌస్‌లో అందమైన అమ్మాయిల హవా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. హోస్ట్‌ నాగార్జున (Biggboss Nagarjuna) వారిని ఓ ఆట ఆడేసుకున్నాడు. ఓ కంటెస్టెంట్‌.. మిమ్మల్ని మాస్టారూ అని పిలవొచ్చా అని అడగడంతో.. ‘మా..కి, స్టార్‌..కి మధ్య గ్యాప్‌ ఇచ్చి మా.. స్టార్‌ అని పిలువు అని నాగ్‌ అనడం అందరిని ఆకట్టుకుంది.

Read More: నేటినుంచే బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6).. ఇప్పటికే పూర్తయిన కంటెస్టెంట్ల ఎంట్రీ షూటింగ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!