Ranga Marthanda: కృష్ణవంశీ సినిమా 'రంగ మార్తాండ' కోసం షాయరీ చెప్పనున్న మెగాస్టార్ చిరంజీవి!

Updated on Jun 29, 2022 03:54 PM IST
'రంగ మార్తాండ'కు మెగాస్టార్‌ చెప్పిన ఈ కవితా పంక్తులు కచ్చితంగా ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. 
'రంగ మార్తాండ'కు మెగాస్టార్‌ చెప్పిన ఈ కవితా పంక్తులు కచ్చితంగా ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. 

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ చాలా కాలం గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా 'రంగమార్తాండ' (Ranga Marthanda). మరాఠీ లో సూపర్ హిట్ అయిన సినిమా "నటసామ్రాట్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఓ నటుడి జీవితానికి దృశ్యరూపంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణాంతర పనులతో చిత్ర బృందం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

కాగా, ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ (Actor Prakash Raj), రమ్యకృష్ణ, శివాత్మిక, ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, అలి రెజా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర అందరిని టచ్ చేస్తుందని చెబుతున్నారు. కాగా ఈ మూవీకి సంగీతం ఇళయరాజా అందించనున్నారు. 

ఇదిలా ఉంటే.. అగ్ర హీరోలు ఇతరుల చిత్రాలకు వాయిస్‌ ఓవర్‌ అందించి ప్రోత్సహించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు చిత్రాలకు నేపథ్య గళాన్ని అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి (Megastar Chiranjeevi). తాజాగా ఆయన మరోసారి వాయిస్‌ ఓవర్‌ అందించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి తన గళంలో కవితా పంక్తుల్ని వినిపించబోతున్నారు చిరంజీవి. 

ఓ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలు ఇవన్నీ చెప్పాలంటే.. 30 ఏళ్లకుపైగా నటనానుభవం ఉన్న చిరంజీవి అయితే బాగుంటుందని కృష్ణవంశీ (Director Krishna Vamshi) భావించారట. ఆ నటుడి తాలుకూ భావోద్వేగాన్ని షాయరీ రూపంలో చెబితే ప్రేక్షకుల మనసులను తాకొచ్చని అనుకున్నారట. ఇప్పటివరకూ చిరంజీవి పలు చిత్రాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినప్పటికీ షాయరీ చెప్పలేదు. అందుకే కృష్ణవంశీ షాయరీ గురించి చెప్పగానే చిరంజీవి ఎగ్జయిట్‌ అయి, ఓకే అన్నారట. ఇటీవలే ఈ షాయరీని రికార్డ్‌ చేశారని, ఒక రోజులోనే చిరంజీవి చెప్పారని తెలిసింది. 'రంగ మార్తాండ'కు మెగాస్టార్‌ చెప్పిన ఈ కవితా పంక్తులు కచ్చితంగా ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. 

ఇక, 'రంగమార్తాండ' సినిమాతో తప్పకుండా కృష్ణ వంశీ తన సత్తా చాటుతారని అంటున్నారు. సినిమాలో చాలా సర్ ప్రైజులు ఉన్నాయని చిత్రయూనిట్ చెబుతున్నారు. ఇప్పటికే సినిమా 90 శాతం పూర్తి కాగా రెండు వారాల్లో షూటింగ్ పూర్తి చేసి ఆగష్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. (Ranga Marthanda Release Date) సినిమా విడుదల తేదీ గురించి మాత్రం అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Read More: Pakka Commercial: 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరంగా చిరంజీవి స్పీచ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!