'ఎన్‌బీకే 108' (NBK108) అప్‌డేట్ : ఎప్పుడూ చూడ‌ని బాల‌య్య‌(Balakrishna) ను చూస్తారు - అనిల్ రావిపూడి

Updated on Aug 11, 2022 05:39 PM IST
NBK108: నంద‌మూరి బాల‌కృష్ణ  (Balakrishna) తో అనిల్ రావిపూడి ఓ యాక్ష‌న్ సినిమాను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌.
NBK108: నంద‌మూరి బాల‌కృష్ణ  (Balakrishna) తో అనిల్ రావిపూడి ఓ యాక్ష‌న్ సినిమాను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌.

NBK 108: టాలీవుడ్ హీరో నంద‌మూరి బాలకృష్ణ  (Balakrishna) కొత్త సినిమా 'ఎన్‌బీకే 108' నుంచి మేక‌ర్స్ అప్‌డేట్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. అఖండ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌‌తో నందమూరి నటసింహా బాలకృష్ణ  సినిమాల‌కు డిమాండ్ పెరిగింది. అనిల్ రావిపూడి 'ఎన్‌బీకే 108' గురించి వివ‌రాల‌ను త‌న ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేశారు. ఇక బాల‌కృష్ణ అభిమానులు కొత్త సినిమా అప్‌డేట్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. 

బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబోలో వ‌స్తున్న సినిమాకు 'ఎన్‌బీకే 108' అనే టెంప‌ర‌రీ పేరు పెట్టారు. ఈ సినిమాను షైన్ స్కీన్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిస్తున్నారు. నిర్మాత‌లు సాహు గూడ‌పాటి, హ‌రీష్ పెద్ది 'ఎన్‌బీకే 108' ను నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ సంగీతం అందించ‌నున్నారు. 

'ఎన్‌బీకే 108' పోస్ట‌ర్‌లో బాల‌కృష్ణ ఫేస్ ఎర్ర‌గా క‌నిపించింది. బాల‌కృష్ణ ఆవేశం వెనుక ఉన్న కార‌ణం ఏంటి?. మ‌రోవైపు అనిల్ రావిపూడి త‌న సినిమాలో బాల‌కృష్ణ‌ను కొత్త‌గా చూపిస్తానని అంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కామెడీతో వినోదం పంచిన ద‌ర్శ‌కుడు అనిల్ 'ఎన్‌బీకే 108'లో త‌న మాస్ సినిమా స‌త్తా ఏంటో చూపించ‌నున్నారా?.

బాలయ్య సరసన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా న‌టించ‌నున్నార‌ట‌. బాల‌కృష్ణ సినిమాలో కొత్త‌ద‌నం కోసం అనిల్ రావిపూడి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే త‌న సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టించాల‌ని రాజ‌శేఖ‌ర్‌ను కోరార‌ట‌.ఈ సినిమాలో బాల‌య్య బాబు తండ్రి పాత్రలో ..పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల కూతురి రోల్‌లో న‌టించ‌నున్నారు. 

ప్ర‌త్యేక పూజ‌లు చేయించిన అనిల్

'ఎన్‌బీకే 108' సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. NBK 108 స్క్రిప్ట్‌ను అనిల్ రావిపూడి  సింహాద్రి అప్పన్న స్వామి వారి పాదాల వ‌ద్ద ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేయించారు. నంద‌మూరి బాల‌కృష్ణ  (Balakrishna) తో అనిల్ రావిపూడి ఓ యాక్ష‌న్ సినిమాను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. బాల‌య్య‌తో తాను తెర‌కెక్కించే సినిమా విజ‌య‌వంతం కావాల‌ని దేవుడిని కోరుకున్నాన‌ని అనిల్ రావిపూడి తెలిపారు. 

Read More: సినారే జీవన సాఫల్య పుర‌స్కారం అందుకున్న నందమూరి బాల‌కృష్ణ‌ (Nandamuri Balarishna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!