Sekhar Movie:శేఖర్ సినిమా నిలిపేయాలంటూ కోర్టు ఆదేశాలు
Sekhar Movie: హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా నిలిపేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫైనాన్సియర్‌కు చెల్లించాల్సిన డబ్బును చెల్లించాలంటూ ఆర్డర్లు జారీ చేసింది. శేఖర్ సినిమాకు థియేటర్లలో ఆడేందుకు అన్ని హక్కులు ఉన్నాయంటూ రాజశేఖర్ రియాక్ట్ అయ్యారు.
రాజశేఖర్ (Dr. Rajasekhar) నటించిన శేఖర్ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే వివాదాలు నెలకొన్నాయి. తమ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదంటూ ఫైనాన్సియర్ పరంధామ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. శేఖర్ సినిమా వ్యవహారంలో కోర్టు రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్‌కు నోటీసులు జారీ చేసింది. ఫైనాన్సియర్‌కు ఇవ్వాల్సిన డబ్బులను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. బ్యాంకులో కోర్టు సూచించిన విధంగా డిపాజిట్ కాకపోవడంతో పిటిషనర్ మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. డబ్బులు డిపాజిట్ కాకపోవడంతో శేఖర్ సినిమా నిలిపేయాలని కోర్టు ఆదేశించింది.
శేఖర్ (Sekhar Movie) సినిమా నిలుపుదలపై రాజశేఖర్ స్పందించారు. తన ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తనకు తన కుటుంబానికి సర్వస్వం శేఖర్ సినిమానే అని రాజశేఖర్ అన్నారు. శేఖర్ సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా కష్టపడ్డామన్నారు. ఆడియన్స్ శేఖర్ సినిమాను ఆదరిస్తున్నారని తెలిపారు. కానీ కొందరు కావాలని తన చిత్రాన్ని అడ్డుకున్నారన్నారు. సినిమానే మా ప్రాణం... = శేఖర్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. శేఖర్ సినిమాను ప్రదర్శించేందుకు అన్ని హక్కులు కలిగి ఉందని రాజశేఖర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.