Balakrishna : బాలకృష్ణ సినిమాలో విలన్‌గా రాజశేఖర్ ! డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం అట్లుంటది.. !
టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమా తర్వాత బాలకృష్ణ (Balakrishna) తో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న 'ఎన్‌బీకే 108' సినిమా వరుస అప్‌డేట్స్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటివరకు అనిల్ ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి కామెడీ సినిమాలతో జనాలను ఎంటర్‌టైన్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక బాలకృష్ణ సినిమాతో, ఈ యంగ్ డైరెక్టర్ ఓ కొత్త కథను ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేంటంటే బాలకృష్ణ సినిమాలో, విలన్ పాత్రలో నటించేందుకు రాజశేఖర్‌ను అనిల్ ఒప్పించారట!.
విలన్ పాత్రలో రాజశేఖర్
రాజశేఖర్ నటించిన సినిమా 'శేఖర్' తాజాగా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా అనుకున్నంత హిట్ సాధించలేదు. అయితే 'శేఖర్' సినిమా విడుదలకు ముందే అనేక వివాదాలలో చిక్కుకుంది. అలాగే రిలీజ్ తర్వాత కూడా ఈ చిత్రానికి పలు అడ్డంకులు ఎదురయ్యాయి.
ఏదేమైనా, రాజశేఖర్ తన 'శేఖర్' సినిమాపై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. కానీ అభిమానుల కోసం రాజశేఖర్ విలన్ పాత్రల్లో కూడా నటించాలని ఫిక్స్ అయ్యారట. జగపతిబాబులా విలన్ గెటప్‌లలో నటించి మెప్పించాలని డిసైడ్ అయ్యారట.
రాజశేఖర్ ఇప్పటివరకు హీరో పాత్రల్లోనే నటించారు. 'బలరామకృష్ణులు' చిత్రం తర్వాత మరే మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. కానీ బాలకృష్ణ (Balakrishna) సినిమాలో కొత్తదనం కోసం అనిల్ రావిపూడి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే తన సినిమాలో విలన్ పాత్రలో నటించాలని రాజశేఖర్‌ను కోరారట. తండ్రీ, కూతుళ్ల అనుబంధాన్ని చూపించే ఒక నూతన ఇతివృత్తంతో అనిల్ కొత్త సినిమా ఎన్‌బీకే 108 తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో బాలయ్య కూతురి పాత్రలో 'పెళ్లిసందడి' హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు.
రాజశేఖర్ ఇమేజ్ తగ్గకుండా
'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో విజయశాంతిని, ఓ కీలక పాత్రలో నటించేలా ఒప్పించారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం రాజశేఖర్‌ను కూడా అలాగే ఒప్పించారట. ఎన్‌బీకే 108 (Balakrishna) సినిమాలో రాజశేఖర్ ఒరిజినల్ వాయిసే ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది.
రాజశేఖర్ సినిమాలకు సాధారణంగా తెలుగులో సాయికుమార్ డబ్బింగ్ చెబుతుంటారు. కానీ ఈ సారి కాస్త డిఫెరెంట్‌గా అనిల్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో రాజశేఖర్ ఇమేజ్ పెరగడం ఖాయమనేది అభిమానుల అంచనా.
Read More: బాలకృష్ణతో (Balakrishna) మూవీ మాములుగా ఉండదు : అనిల్ రావిపూడి