'ఆహా'లో మరో సరికొత్త రియాలిటీ షో 'డ్యాన్స్ ఐకాన్' (Dance Ikon).. న్యాయనిర్ణేతగా రమ్యకృష్ణ (Ramya Krishnan) ఎంట్రీ..!

Updated on Sep 13, 2022 09:06 PM IST
రమ్యకృష్ణతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Shekar Master) కూడా జడ్జిగా ఈ షోతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.
రమ్యకృష్ణతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Shekar Master) కూడా జడ్జిగా ఈ షోతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.

తెలుగులో ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' (Aha) దూసుకుపోతోంది. ఇప్పటికే 'ఎన్‌బీకే అన్‌ స్టాపబుల్‌', 'తెలుగు ఇండియన్‌ ఐడల్‌' (Telugu Indian Idol) వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన 'ఆహా' మరో సరికొత్త షోతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. తెలుగు ఇండియన్ ఐడల్ షో సక్సెస్ అయ్యాక, మరోసారి నాన్-ఫిక్షన్‌లో తన సత్తా చాటడానికి 'డాన్స్ ఐకాన్‌'తో సిద్ధమవుతోంది.  

ఓంకార్ యాంకర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయింది. లాంచ్ ఎపిసోడ్ నిన్న(సెప్టెంబర్ 11న) ఆహాలో స్ట్రీమ్ అయింది. సెప్టెంబర్ 17 నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఇక ఈ షోకు రమ్యకృష్ణ (Ramya Krishnan) జడ్జిగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ కాగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

రమ్యకృష్ణతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Shekar Master) కూడా జడ్జిగా ఈ షోతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక, ఓటీటీలో న్యాయనిర్ణేతగా తన అరంగ్రేటం గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. "డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఫార్మాట్ ఈమధ్య కాలంలో ఎవరూ చేయలేదు. ఈ షో ద్వారా అందరూ కొత్త రమ్యని చూస్తారు" అని అన్నారు.

తాజాగా రిలీజ్ చేసిన 'డ్యాన్స్ ఐకాన్' (Dance Icon) ప్రోమోలో డ్యాన్సర్లు తమ డ్యాన్సులతో అదరగొట్టగా.. రమ్యకృష్ణ జడ్జిగా తనదైన మార్క్‌ని చూపించినట్లు తెలుస్తోంది. ఇక శేఖర్ మాస్టర్ 'సూపర్..సూపర్' అంటూ ఫుల్ ఎనర్జీతో కనిపించారు. యాంకర్ శ్రీముఖి కూడా పంచ్ డైలాగులతో తెగ హంగామా చేసింది. 

ఇక మరో స్టార్ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ (Yashwant Master) కూడా కంటెస్టెంట్స్‌తో మాస్ డ్యాన్స్ చేసి అదరగొట్టేసాడు. శేఖర్ మాస్టర్ సైతం కంటెస్టెంట్స్‌తో డ్యాన్స్ వేశారు. ప్రోమో మాత్రం అదిరిపోయింది.

Read More: Anchor Sreemukhi: దుబాయిలో వాలిపోయిన యాంకర్ శ్రీముఖి.. బుర్జ్ ఖలీఫా వద్ద హాట్ హాట్ పోజులు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!