నిహారిక కొణిదెల‌ (Niharika Konidela): భ‌ర్త‌తో విభేదాలపై నిహారిక క్లారిటీ

Updated on Apr 27, 2022 07:57 PM IST
కొత్త ప్రాజెక్టు ప్రారంభ కార్య‌క్ర‌మంలో నిహారిక (Niharika Konidela) దంప‌తులు
కొత్త ప్రాజెక్టు ప్రారంభ కార్య‌క్ర‌మంలో నిహారిక (Niharika Konidela) దంప‌తులు

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారిక కొణిదెల ఇటీవ‌ల హైద‌రాబాద్ లోని ఓ పబ్ లోని రేవ్ పార్టీలో దొరికి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా అర్ద‌రాత్రి తెరుచుకొని ఉన్న ప‌బ్ లో ఆమె త‌న స్నేహితుల‌తో క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు పుకార్లు వ‌చ్చాయి. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి కూడా తీసుకొని ఆ త‌ర్వాత విడిచిపెట్టారు. ఇక‌, దీనిపై నాగ‌బాబు స్వ‌త‌హాగా త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ లో వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. దీంతో పాటు భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో విడిపోయిన‌ట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. 
ఈ నేప‌థ్యంలో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నిహారిక తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. నిహారిక‌, చైత‌న్య క‌లిసి నిర్మించిన ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో ఓ వెబ్ సిరీస్ కు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో వారిద్ద‌రూ క‌లిసి ఉండ‌టం విశేషం. దీంతో ఈ దంప‌తులిద్ద‌రూ విడిపోయిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌కు నిహారిక ఒక్క ఫోటోతో చెక్ పెట్టిన‌ట్లయింది.
ఇక‌, నిహారిక నిర్మిస్తున్న వెబ్ సిరీస్ విష‌యానికి వ‌స్తే.. జీ5 ఓటీటీ కోసం ఆమె ఓ కొత్త ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇందులో ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేశ్‌, హీరోయిన్ స‌దా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మంగ‌ళవారం ఇందుకు సంబంధించిన ఓపెనింగ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో నిహారిక భ‌ర్త‌తో పాటు, ఆమె త‌ల్లి, యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ‘హలో వరల్డ్ ‘పేరుతో రూపొంద‌నున్న ఈ వెబ్ సిరీస్ కు శివ సాయి వర్థన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నాడు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!