Vishwak Sen : విశ్వక్ సేన్ , ఐశ్వర్య జంటగా నటించే సినిమాకి.. దర్శకుడిగా యాక్షన్ కింగ్ ' అర్జున్ ' !

Updated on Jun 04, 2022 05:29 PM IST
Vishwak Sen :  విశ్వక్ సేన్ .. ప్రస్తుతం టాలీవుడ్ యువ నటులలో, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ కలిగిన హీరో అతడు. 
Vishwak Sen :  విశ్వక్ సేన్ .. ప్రస్తుతం టాలీవుడ్ యువ నటులలో, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ కలిగిన హీరో అతడు. 

Vishwak Sen :  విశ్వక్ సేన్ .. ప్రస్తుతం టాలీవుడ్ యువ నటులలో, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ కలిగిన హీరో.  తాను చేసినవి కొన్ని సినిమాలే అయినా, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఈ హీరో చెప్పే డైలాగ్స్ ఒక వర్గం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 

Vishwak Sen :  విశ్వక్ సేన్ తన తొలి చిత్రం ' ఫలక్ నామా దాస్'తో పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. ఈ నగరానికి ఏమైంది, పాగల్, హిట్, అశోకవనంలో అర్జున్ కళ్యాణం లాంటి సినిమాలతో మినిమమ్ గ్యారంటీ హీరోగా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నాడు. 

అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్ యాంకర్‌తో జరిగిన వివాదంతో, ఈ మధ్యకాలంలో మళ్లీ తెరమీదికొచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఇతడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని టాక్. అయితే ఆ వార్త నిజమేనని తెలుస్తోంది. తాజాగా పింక్ విల్లా టీమ్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని విశ్వక్ సేన్ తెలిపారు.

విశ్వక్ సేన్, అర్జున్ కలిసి చేసే ప్రాజెక్ట్.. ఖచ్చితంగా ఓ డిఫరెంట్ సినిమా అవుతుంది

Arjun Sarja : అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారని కూడా చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఇంకా డిస్కషన్ ఫేజ్‌లోనే ఉందని, బహుశా వచ్చే నెల పూజా కార్యక్రమాలు జరుపుకొని, సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని విశ్వక్ సేన్ తెలిపారు. 

కోనసీమ కుర్రాడు, ఒకే ఒక్కడు, హనుమాన్ జంక్షన్, శ్రీ ఆంజనేయం, శ్రీమంజునాథ, జైహింద్, పుట్టింటికి రా చెల్లి లాంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు అర్జున్. కొన్ని సంవత్సరాల పాటు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఆయన ఇతర భాషలలో నటించిన సినిమాలు కూడా, తెలుగులో డబ్ చేయబడి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆయనే ఓ సినిమాని డైరెక్ట్ చేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయమే.

విశ్వక్ సేన్ చేస్తున్న తదుపరి ప్రాజెక్ట్స్ ఇవే

Vishwak Sen : విశ్వక్ సేన్ ఖాతాలో  ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. తమిళ చిత్రం 'ఓ మై కాదువలే' కి రీమేక్‌గా, తెలుగులో తెరకెక్కుతున్న 'ఓరి దేవుడా' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 'ఓ మై కాదువలే'కి దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తు ఈ సినిమాని తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. 

అలాగే దాస్ కా దమ్కీ, ముఖ చిత్రం, స్టూడెంట్ ఇన్ ది కిట్టీ, ఫలక్ నామాదాస్ 2 లాంటి సినిమాలన్నీ ప్రస్తుతం విశ్వక్ సేన్ లిస్టులో ఉన్నాయి. 

Read More:  ‘ఆహా’ ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న.. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ !

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!