‘అశోకవనంలో’ సినిమా సక్సెస్‌తో రెమ్యునరేషన్‌ పెంచేసిన విశ్వక్‌సేన్ (Vishwaksen).. షాకవుతున్న నిర్మాతలు

Updated on May 24, 2022 05:18 PM IST
విశ్వక్‌సేన్ (Vishwaksen)
విశ్వక్‌సేన్ (Vishwaksen)

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్ (Vishwaksen) ప్రస్తుతం ‘అశోకవ‌నంలో అర్జున క‌ల్యాణం’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. విద్యాసాగర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై  విడుదలకు ముందే మంచి హైప్‌ క్రియేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే6వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. విశ్వక్ సేన్ హైదరాబాద్‌ రోడ్డుపై చేసిన ప్రాంక్ వీడియోపై పలు విమర్శలు ఎదురయ్యాయి. ఏది ఎలా ఉన్నా ‘అశోక వనంలో ‘ సినిమా మాత్రం సక్సెస్‌ సాధించింది.

ఇక, ఈ సినిమా సక్సెస్‌తో విశ్వక్‌సేన్‌ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. 'అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమాకు ముందు వరకు రూ.1.5-2 కోట్ల వరకు పారితోషికం తీసుకునే విశ్వక్‌.. ఇప్పుడు రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేశాడట. కొత్త ప్రాజెక్ట్స్‌ కోసం విశ్వక్‌ దగ్గరికి వెళ్తే తన రెమ్యునరేషన్‌ రూ.3 కోట్లు చెబుతున్నట్టు టాక్. విశ్వక్‌ నిర్ణయంతో నిర్మాతలు షాక్ అవుతున్నారని సమాచారం. అడిగినంత ఇస్తేనే సినిమా చేయడానికి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాడని తెలుస్తోంది.  

‘ఫలక్‌నుమా దాస్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విశ్వక్‌సేన్. తర్వాత ‘హిట్‌ ‘ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు విశ్వక్. 33 సంవత్సరాలు వచ్చినా, పెళ్లికాని వ్యక్తి పాత్రలో చాలా సహజంగా నటించాడు ఈ సినిమాలో. విద్యాసాగర్‌‌ చింతా దర్శకత్వం వహించిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ సినిమా ఈనెల 6వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇదే క్రమంలో హీరో విశ్వక్‌సేన్ హైదరాబాద్‌ నడిరోడ్డుపై చేసిన ప్రాంక్‌ ప్రమోషన్‌ వీడియో పలు విమర్శలకు దారితీసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విశ్వక్‌ ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు బాగా పండాయి. సినిమాలో అర్జున్‌కుమార్‌‌కు మనలాగనే భయం. అభద్రతా భావం ఎక్కువ. 33 సంవత్సరాలు వచ్చే వరకు ఇవన్నీ భరించి ఇక భరించలేక ఏం చేశాడన్నదే ‘ సినిమా కథ అని చెప్పాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!