విశ్వక్‌సేన్ (Vishwaksen) : ‘ఆహా’ ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న.. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ !

Updated on May 27, 2022 04:43 PM IST
‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమా పోస్టర్
‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమా పోస్టర్

ఫలక్​నుమా దాస్, పాగల్, హిట్‌ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈ యువ నటుడి తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కల్యాణం’.  మే 6వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లును కూడా రాబట్టింది.

విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. తన ఇదివరకటి సినిమాలతో  'మాస్ కా దాస్' అనిపించుకున్న విశ్వక్ సేన్ (Vishwaksen) మొదటిసారి ఓ పూర్తిస్థాయి కుటుంబ కథాచిత్రంలో నటించాడు.

తెలంగాణలోని సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసే అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్)కి తన కులంలో సంబంధాలు దొరక్కపోవడంతో, కులాంతర వివాహానికి రెడీ అవుతాడు. ఇదే క్రమంలో, తనకు ఆంధ్రా అమ్మాయి మాధవి (రుక్సర్ ధిల్లాన్) తో పెళ్లి ఫిక్స్ అవుతుంది.

అందుకే నిశ్చితార్థం కోసం బంధుమిత్రులతో, తెలంగాణ నుంచి ఆంధ్రాకి బయలుదేరుతాడు. అయితే సరిగ్గా అదే టైంకి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో అందరూ పెళ్లివారి ఇంట్లో లాక్ అయిపోతారు. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్.

సరిగ్గా పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న టైంలో పెళ్లి కూతురు జంప్ అవుతుంది. మాధవి, అర్జున్ కుమార్‌ని వదిలి ఎందుకు వెళ్లిపోతుంది. అసలు  అర్జున్  పెళ్లి  ఎవరితో జరుగుతుంది ? ఎప్పుడు అవుతుంది? అని  తెలుసుకోవాలంటే  జూన్  3  నుండి  ఆహాలో స్ట్రీమింగ్ కానున్న 'అశోక వనంలో అర్జున కళ్యాణం' (Ashokavanamlo Arjuna Kalyanam) సినిమా చూడాల్సిందే.

విశ్వక్‌సేన్ (Vishwaksen) హీరోగా నటించిన ఈ సినిమాలో గోపరాజు రమణ, రితికా నాయక్, కేదార్, వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జయ క్రిష్ సంగీతం అందించగా.. కథ, కథనం, మాటల్ని రవికిరణ్ కోలా అందించారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!