Liger: 'లైగ‌ర్' డిజాస్టర్‌తో భారీగా న‌ష్టం .. త‌క్కువ వ‌సూళ్లను రాబ‌డుతోన్న రౌడీ హీరో (Vijay Deverakonda) సినిమా

Updated on Sep 01, 2022 01:41 PM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda)'లైగ‌ర్' సినిమాను కొన్ని రోజుల్లోనే థియేటర్ల నుంచి పూర్తిగా తొలిగించే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda)'లైగ‌ర్' సినిమాను కొన్ని రోజుల్లోనే థియేటర్ల నుంచి పూర్తిగా తొలిగించే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Liger: టాలీవుడ్ హీరో  విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda) న‌టించిన పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్' అంత‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ సినిమా కోసం ప్ర‌పంచ ఫైట‌ర్ మైక్ టైస‌న్‌ను రంగంలోకి దించారు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. కానీ మైక్ టైస‌న్ వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింది. పూరీ జ‌గ‌న్నాథ్ ప‌డిన శ్ర‌మ వృథా అయింది. భారీ బ‌డ్జెట్ సినిమా నెగిటీవ్ టాక్‌తో ఫ్లాప్‌గా మారింది. 

అంచనాలు తారుమారు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు 'లైగ‌ర్' (Liger) డిజాస్ట‌ర్‌ను మిగిల్చింది. రౌడీ హీరో  ఇండియాలోనే బిగ్ స్టార్ అవుతాడ‌ని పూరీ జ‌గ‌న్నాథ్ అనుకున్నారు. కానీ ఆ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. 'లైగ‌ర్' వ‌సూళ్లు రోజు రోజుకు ప‌డిపోతున్నాయి. సినిమా రిలీజ్ అయి వారంలోపు రూ. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంద‌నుకున్న చిత్ర యూనిట్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. 'లైగ‌ర్' సినిమా రోజుకు కోటి రూపాయ‌లు కూడా వ‌సూళ్లు చేయ‌లేక‌పోతోంది. 

కోటి దాట‌ని వ‌సూళ్లు

ట్రేడ్ రిపోర్ట్స్ లైగ‌ర్ చిత్రం ఏడ‌వ‌ రోజు ఇండియాలో రూ. 90 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీంతో మేక‌ర్స్ డీలా ప‌డ్డారు. మ‌రోవైపు ప‌లు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 'లైగ‌ర్' సినిమాను కొన్ని రోజుల్లోనే థియేటర్ల నుంచి పూర్తిగా తొలిగించే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 'లైగ‌ర్' సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ మూడేళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. కానీ విజ‌య్ శ్ర‌మ వృథా అయిపోయింది. నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లైగ‌ర్ చిత్రం భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. 

Read More: Liger: థియేటర్ ఓనర్‌ను క్ష‌మించ‌మ‌ని అడిగిన రౌడీ హీరో ( Vijay Deverakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!