Liger: థియేటర్ ఓనర్‌ను క్షమించమని అడిగిన రౌడీ హీరో ( Vijay Deverakonda)
Liger: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు 'లైగర్' సినిమా అనుకున్నంత భారీ విజయాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాని పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందే విజయ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ముంబైలోని ఓ థియేటర్ ఓనర్ విజయ్ దేవరకొండ కామెంట్లపై సీరియస్ అయ్యాడు. దీంతో విజయ్ ఆ థియేటర్ ఓనర్‌ను కలిసి క్షమించమని అడిగారు.
విజయ్‌పై ఫైర్ అయిన థియేటర్ ఓనర్
'లైగర్' (Liger) సినిమా కోసం విజయ్ దేవరకొండ దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు. అయితే 'లైగర్' సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఈ సినిమా విడుదలకు ముందు 'బాయ్ కాట్ బాలీవుడ్' వివాదంపై విజయ్ ఓ కామెంట్ చేశారు. 'సినిమా నచ్చితే ప్రేక్షకులు వచ్చి చూస్తారు.. లేదంటే చూడరని' విజయ్ అన్నారు. అయితే హీరో చాలా పొగరుగా మాట్లాడారని, అటువంటి బిహేవియర్ మంచిది కాదని విజయ్ దేవరకొండపై కొందరు ప్రేక్షకులు ఫైర్ అయ్యారు.
ముంబైకి చెందిన మనోజ్ దేశాయ్ అనే థియేటర్ యజమాని కూడా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కామెంట్లపై ఫైర్ అయ్యారు. మనోజ్ దేశాయ్ 'మరాఠా మందిర్' సినిమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. విజయ్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. విజయ్‌కు అంత కోపం పనికిరాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమాను కావాలంటే 'బాయ్ కాట్' చేసుకోండని చెప్పి అమీర్ ఖాన్, తాప్సి, అక్షయ్ కుమార్ లాంటి నటీనటులు నష్టపోయారని ఆయన మండిపడ్డారు.
మనోజ్‌కు విజయ్ క్షమాపణలు
మనోజ్ దేశాయ్ ఆవేదన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరకు చేరింది. దీంతో విజయ్ దేవరకొండ ముంబై వెళ్లి మనోజ్ దేశాయ్‌ను కలిశారు. 'నా మాటలు బాధ కలిగిస్తే క్షమించండి' అంటూ మనోజ్‌ను కోరారు. దీంతో మనోజ్ దేశాయ్ కూల్ అయ్యారు. సినిమా పరిశ్రమ, థియేటర్ల వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందనే తన ఆవేదన అంటూ మనోజ్ తెలిపారు.
Read More: Liger: 'లైగర్' చిత్రంలో జోకర్‌లా ఫైటర్!.. మైక్ టైసన్‌పై అంచనాలు తారుమారయ్యాయా?.