Liger : 'లైగ‌ర్' తొలి రోజు వ‌సూళ్లు ఎంత‌?.. రౌడీ హీరో (Vijay Deverakonda) కామెంట్స్‌తో క‌లెక్ష‌న్లు త‌గ్గాయా!

Updated on Aug 26, 2022 05:35 PM IST
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) న‌టించిన'లైగ‌ర్' సినిమా తొలి రోజు  ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 13.45 కోట్లను వ‌సూళ్లు చేసింది.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) న‌టించిన'లైగ‌ర్' సినిమా తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 13.45 కోట్లను వ‌సూళ్లు చేసింది.

Liger : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) న‌టించిన పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్'. ఈ చిత్రం క‌లెక్షన్లు కాస్త స్లోగానే ఉన్నాయి. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ సినిమా, భారీ క‌లెక్ష‌న్ల‌ను వ‌సూళ్లు చేయ‌లేక‌పోతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య‌పాండేలు జంట‌గా న‌టించిన 'లైగ‌ర్' ఆగ‌స్టు 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. 

భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ ద‌ర్శ‌క. నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరోయిన్ ఛార్మీకౌర్ కూడా మరో నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే, అలీ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకు సంబంధించి పూరీ ద‌ర్శ‌క‌త్వం అంతలా ఆకట్టుకోలేదని టాక్.  ఈ విషయాన్ని కొంద‌రు ప్రేక్ష‌కులు ఓపెన్‌గా చెబుతున్నారు. విజ‌య్ నటనకు మంచి మార్కులు పడినా.. సినిమా సబ్జెక్టు మాత్రం తేలిపోయిందని అంటున్నారు.  తెలుగు సినిమా అయినప్పటికీ, హిందీ నేటివిటీ ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

అస‌లు అన‌న్య పాండే హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు సెట్ కాలేదని కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇంత నెగెటివ్ టాక్‌లోనూ 'లైగ‌ర్' (Liger) వ‌సూళ్ల ప‌రంగా కొన్ని చోట్ల మంచి క‌లెక్ష‌నే రాబ‌ట్టింది. మ‌రి కొన్ని చోట్ల మాత్రం వ‌సూళ్లు దారుణంగా ప‌డిపోయాయి.

లైగ‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ 

  • నైజాం - రూ. 4.24 కోట్లు
  • సీడెడ్  - రూ. 1.32 కోట్లు
  • ఉత్తరాంధ్ర  - రూ. 1.27 కోట్లు
  • ఈస్ట్  - రూ. 0.64 కోట్లు
  • వెస్ట్  - రూ. 0.39 కోట్లు
  • గుంటూరు  - రూ.0.83 కోట్లు
  • కృష్ణా  - రూ. 0.48 కోట్లు
  • నెల్లూరు  - రూ.0.40 కోట్లు
  • ఏపీ + తెలంగాణ  - రూ. 9.57 కోట్లు (రూ.15.40 కోట్ల గ్రాస్‌)
  • రెస్ట్ ఆఫ్ ఇండియా  - రూ. 0.55 కోట్లు
  • ఓవర్సీస్  - రూ. 1.10 కోట్లు
  • మిగిలిన వెర్షన్లు  - రూ. 0.22 కోట్లు
  • వరల్డ్ వైడ్ - రూ.13.45కోట్లు (- రూ. 24.30 కోట్లు - గ్రాస్‌) 

'లైగ‌ర్' సినిమా తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 13.45 కోట్లను వ‌సూళ్లు చేసింది. అంటే, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సినిమా విడుద‌లైన మొద‌టి రోజు అనుకున్నంత బిజినెస్ చేయ‌లేక‌పోయింది.

'లైగర్' రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌తో బ‌రిలోకి దిగింది. ఈ సినిమా ఇంకా రూ. 76.55 కోట్ల బిజినెస్ చేయాల్సి ఉంది. ఓ వైపు విజ‌య్ కామెంట్స్, మ‌రోవైపు బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ 'లైగ‌ర్‌' సినిమాపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయో చూడాలి. 

Read More: Liger Movie Review: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘లైగర్’ సినిమా మాస్‌ ప్రేక్షకులకు మాత్రమే !

 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!