'లైగ‌ర్' ల‌వ్ సాంగ్ వీడియో రిలీజ్.. ‘నే క‌ల‌లో కూడా అనుకోలేదే’ అంటున్న విజ‌య్ (Vijay Deverakonda)

Updated on Aug 30, 2022 07:14 PM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన'లైగ‌ర్' చిత్రం నుంచి ‘క‌ల‌లో కూడా’ అంటూ సాగే మెలోడియ‌స్ సాంగ్ వీడియోను విడుద‌ల చేశారు.
విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన'లైగ‌ర్' చిత్రం నుంచి ‘క‌ల‌లో కూడా’ అంటూ సాగే మెలోడియ‌స్ సాంగ్ వీడియోను విడుద‌ల చేశారు.

Liger: టాలీవుడ్ హీరో  విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్' నుంచి మేక‌ర్స్ ల‌వ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేల మ‌ధ్య సాగే ల‌వ్ సాంగ్ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్  తెర‌కెక్కించిన ఈ సినిమా ఆగ‌స్టు 25న‌ ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అయింది. మైక్ టైస‌న్‌, ర‌మ్య‌కృష్ణ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

'లైగ‌ర్' ల‌వ్ సాంగ్

'లైగ‌ర్' చిత్రం నుంచి ‘క‌ల‌లో కూడా’ అంటూ సాగే మెలోడియ‌స్ సాంగ్ వీడియోను విడుద‌ల చేశారు. ఈ పాట‌కు త‌నిష్క్ బాగ్చీ సంగీతం స‌మ‌కూర్చారు. భాస్క‌రభ‌ట్ల రాసిన లిరిక్స్‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. 'లైగ‌ర్' సినిమా విడుద‌ల‌కు ముందు భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ ఈ సినిమా విడుద‌ల త‌రువాత నెగెటీవ్ టాక్‌తో అనుకున్నంత బిజినెస్ చేయ‌లేదు.

'లైగ‌ర్' బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. మిక్సిడ్ రివ్యూల‌తో ఫ్లాప్ సినిమాగా మిగిలింది. ఇప్పటి వ‌ర‌కు ఈ చిత్రం రూ.25 కోట్ల షేర్‌ను సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం మ‌రో రూ.64 కోట్ల‌ను వ‌సూళ్లు చేయాల్సి ఉంది. 

భారీ బ‌డ్జెట్ సినిమా ఫ్లాప్

భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ ద‌ర్శ‌క. నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరోయిన్ ఛార్మీకౌర్ కూడా మరో నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే, అలీ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకు సంబంధించి పూరీ ద‌ర్శ‌క‌త్వం అంతలా ఆకట్టుకోలేదని టాక్. ఈ విషయాన్ని కొంద‌రు ప్రేక్ష‌కులు ఓపెన్‌గా చెబుతున్నారు. విజ‌య్ (Vijay Deverakonda) నటనకు మంచి మార్కులు పడినా.. సినిమా సబ్జెక్టు మాత్రం తేలిపోయిందని అంటున్నారు.  తెలుగు సినిమా అయినప్పటికీ, హిందీ నేటివిటీ ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

అస‌లు అన‌న్య పాండే హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు సెట్ కాలేదని కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇంత నెగెటివ్ టాక్‌లోనూ 'లైగ‌ర్' (Liger) వ‌సూళ్ల ప‌రంగా కొన్ని చోట్ల మంచి క‌లెక్ష‌నే రాబ‌ట్టింది. మ‌రి కొన్ని చోట్ల మాత్రం వ‌సూళ్లు దారుణంగా ప‌డిపోయాయి.

Read More: Liger Movie Review: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘లైగర్’ సినిమా మాస్‌ ప్రేక్షకులకు మాత్రమే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!