Raviteja: వ‌రుసగా యాక్ష‌న్ సినిమాల‌తో అద‌ర‌గొడుతోన్న మాస్ మహరాజ్ ర‌వితేజ‌!

Updated on Jun 01, 2022 09:04 PM IST
రవితేజ అప్ క‌మింగ్ మూవీ పోస్ట‌ర్స్ (Raviteja Movie Upcoming Movie Posters)
రవితేజ అప్ క‌మింగ్ మూవీ పోస్ట‌ర్స్ (Raviteja Movie Upcoming Movie Posters)

Raviteja: మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి.. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి.. ఆ తర్వాత సోలో హీరోగా మారాడు రవితేజ. అలా ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను అలరిస్తూ మాస్ మహారాజా అన్న బిరుదును పొందాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకువెళ్తున్నాడు. అయితే, ఆ మధ్య పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డ రవితేజ.. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ త‌ర్వాత మళ్లీ ఖిలాడి సినిమాతో నిరాశపరిచాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. దీంతో కలెక్షన్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఇదిలా ఉండగా, ఖిలాడి సినిమా చేస్తోన్న సమయంలోనే రవితేజ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టేశాడు. 

ఇందులో భాగంగానే రామారావు ఆన్ డ్యూటీ (Ramarao on Duty), రావణాసుర, ధమాకా సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తున్నారు.ఈ సీనిమాల తర్వాత రవితేజ తాజాగా మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని డైరక్షన్ లో రవితేజ హీరోగా ఒక సినిమా రాబోతుందట. ఈ డైరెక్ట‌ర్ కెమెరా మెన్ కాకుండా కాదు యంగ్ హీరో నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మెగా ఫోన్ పడుతున్నాడు. కార్తీక్ చెప్పిన కథకు రవితేజ ఫిదా అయ్యారట. కథ ఓకే అవడమే ఆలస్యం.. వెంటనే సినిమా చేసేద్దామని చెప్పారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని టాక్. 

ధ‌మాకా మూవీ పోస్ట‌ర్ (Dhamaka Movie Poster)

అయితే, ర‌వితేజ ఇప్పటికే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీతో పాటు 'రావణాసుర' (Ravanasura) చిత్రాలను పట్టాలెక్కించేశాడు. ఆయ‌న ఇదివ‌ర‌కే ఈ సినిమాల‌కు సంబంధించిన చాలా వరకూ షూటింగ్‌ను కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న సినిమాలే కాకుండా, రవితేజ.. డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో కూడా ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి 'ధమాకా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. 

అయితే, ఈ చిత్రంలో రవితేజ మార్క్ టైమింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించబోతున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ చూడని కొత్త కాన్సెప్టుతో దీన్ని రూపొందించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త షికార్లు చేస్తోంది. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ధమాకా' (Dhamaka) మూవీలో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని ఇప్పటికే ఓ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో మరో హీరో కూడా నటిస్తున్నట్లు తెలిసింది. తనదైన శైలి చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సినిమాలో అతి ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర మొత్తం సినిమా కథనే మలుపు తిప్పే విధంగా ఉండబోతోందట. అంతేకాదు, త్వరలోనే అతడు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. 

అదేవిధంగా వంశీ దర్శకత్వంలో “టైగర్ నాగేశ్వర రావు“ (Tiger Nageswar rao), సుధీర్ వర్మ దర్శకత్వంలో “రావణాసుర “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. అక్కినేని హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు స‌మాచారం. 

ఇక‌, ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ (First Look Poster) పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఫైట్ మాస్టర్ నేతృత్వంలో హీరో రవి తేజ , సుశాంత్ లపై ఒక భారీ యాక్షన్ సీన్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ “రావణాసుర” మూవీ లో కీలకంగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీ పోస్ట‌ర్ (Tiger Nageswar rao Poster)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!