నందమూరి హరికృష్ణ జయంతి నేడు..ఎమోషనల్ ట్వీట్ చేసిన ఎన్టీఆర్ (NTR), కల్యాణ్ రామ్
Harikrishna Birth Anniversary: టాలీవుడ్ సీనియర్ నటులు నందమూరి హరికృష్ణ 66వ జయంతి సందర్భంగా ఆయన కుమారులు ఎన్టీఆర్ (NTR), కల్యాణ్ రామ్‌లు నివాళులు అర్పించారు. సోషల్ మీడియాలో భావోద్వేగమైన ట్వీట్ చేశారు. తండ్రితో తమకున్న అనుబంధం గుర్తుచేసుకున్నారు. తమ తండ్రి 66వ జయంతి రోజన ఆయన్ను స్మరించుకుంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నటుడిగా హరికృష్ణ
నందమూరి హరికృష్ణ ఎన్టీఆర్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేశారు. ఎన్టీఆర్ మూడవ కూమారుడు హరికృష్ణ. 1967లో 'శ్రీకృష్ణావతారం' సినిమాతో హరికృష్ణ బాలనటుడిగా పరిచయం అయ్యారు. తొలినాళ్ళలో సినిమాల్లో నటించిన హరికృష్ణ తండ్రి రాజకీయ ప్రవేశం తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
హరికృష్ణ సుమారు 25 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత 'శ్రీరాములయ్య' సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సీతారామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ లాంటి సందేశాత్మక సినిమాల్లో నటించారు. ఆయన నటించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. హరికృష్ణ నటించిన సినిమాలు తక్కువే అయినా ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
నాన్నకు ప్రేమతో
1982లో టీడీపీ పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ చేపట్టిన చైతన్యరథానికి హరికృష్ణ రథ సారధిగా వ్యవహిరంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 50వేల కిలోమీటర్ల చైతన్యరథ యాత్ర పూర్తయ్యేవరకు ఎన్టీఆర్‌తోనే ఉన్నారు. చైతన్య రథాన్ని హరికృష్ణ డ్రైవ్ చేస్తూ ఎన్టీఆర్‌కు మద్ధతుగా నిలిచారు. హరికృష్ణ తన తండ్రి పట్ల ఎలాంటి గౌరవం కలిగి ఉండేవారో.. ఆయన కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా హరికృష్ణను అంతే గౌరవిస్తారు. హరికృష్ణ జయంతి రోజున ఎన్టీఆర్ (NTR), కల్యాణ్ రామ్ ఎమోషనల్ ట్వీట్లు చేశారు.