Brahmastra: RRR సినిమా సక్సెస్ అయ్యాక, ఎన్టీఆర్‌కు పెరిగిన ఫాలోయింగ్.. బాలీవుడ్ ఈవెంట్‌ల‌కు ఆహ్వానం !

Updated on Aug 27, 2022 04:15 PM IST
Brahmastra:  'బ్రహ్మాస్త్రం'  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ (NTR)ను ఆహ్వానించారని సమాచారం.
Brahmastra: 'బ్రహ్మాస్త్రం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ (NTR)ను ఆహ్వానించారని సమాచారం.

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ (NTR) 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీముడిని పోలిన పాత్రలో న‌టించి ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ఓ హాలీవుడ్ పత్రిక ప్రకటించిన ఆస్కార్ అవార్డుల ప్రెడిక్షన్ లిస్టులో చోటు దక్కించుకున్నారు .

ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌కు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. హాలీవుడ్ లెవ‌ల్‌‌లో కూడా ఎన్టీఆర్‌కు గుర్తింపు ద‌క్కింది.  బాలీవుడ్ ఈవెంట్‌ల‌కు కూడా ఎన్టీఆర్‌కు ప్ర‌త్యేక ఆహ్వానాలు అందుతున్నాయి.

సెప్టెంబర్ 9 న రిలీజ్ కానున్న 'బ్రహ్మాస్త్రం'

బాలీవుడ్‌‌‌ స్టార్ కపుల్స్ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన సినిమా బ్ర‌హ్మాస్త్ర (Brahmastra). ఈ సినిమా తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో రిలీజ్ కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కింది. 'బ్రహ్మాస్త్రం' మొదటి భాగం సెప్టెంబర్ 9 తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింతగా పెంచారు మేక‌ర్స్.

Brahmastra:  'బ్రహ్మాస్త్రం'  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ (NTR)ను ఆహ్వానించారని స‌మాచారం.

గెస్ట్‌గా ఎన్టీఆర్

Brahmastra: 'బ్రహ్మాస్త్రం' మొదటి భాగం 'శివ' పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున‌, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లలో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో 'బ్ర‌హ్మాస్త్రం' తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ను ఆహ్వానించారని స‌మాచారం. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 2 తేదీన హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది.

'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో ఎన్టీఆర్‌కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ప‌లువురు చిత్ర ప్ర‌ముఖులు కూడా, తమ సినిమా ఈవెంట్‌ల‌కు ముఖ్య అతిథిగా రావాలంటూ ఎన్టీఆర్‌కు ఆహ్వానాలు పంపుతున్నార‌ట‌. 

'బ్రహ్మాస్త్రం' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కించారు. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రంలో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) అతిథి పాత్రలో క‌నిపించ‌నున్నారు. దాదాపు రూ. 500 కోట్ల‌తో బడ్జెట్‌తో 'బ్రహ్మాస్త్రం' సినిమాను కరణ్‌ జోహార్, రణ్‌బీర్‌కపూర్ సంయుక్తంగా నిర్మించారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!