‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ ట్రైల‌ర్ లాంచ్ ప్రోమో రిలీజ్!.. నితిన్ (Nithiin) మాస్ యాక్ష‌న్ అదుర్స్

Updated on Jul 29, 2022 05:18 PM IST
నితిన్ (Nithiin) న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా ట్రైల‌ర్‌ను జూలై 30 తేదీన రిలీజ్ చేయ‌నున్నారు.
నితిన్ (Nithiin) న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా ట్రైల‌ర్‌ను జూలై 30 తేదీన రిలీజ్ చేయ‌నున్నారు.

Macherla Niyojakavargam: టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) విభిన్న‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతారు. నితిన్ న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా నుంచి ట్రైల‌ర్ రిలీజ్ కానుంది. 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా ట్రైల‌ర్‌ను జూలై 30 తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ ట్రైల‌ర్ లాంచ్ ప్రోమో వీడియోను మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో విడుద‌ల‌ చేశారు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

నితిన్ (Nithiin) న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా ట్రైల‌ర్‌ను జూలై 30 తేదీన రిలీజ్ చేయ‌నున్నారు.

క‌లెక్ట‌ర్ పాత్ర‌లో నితిన్

నితిన్ (Nithiin), కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' చిత్రం ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ గుంటూరులో జ‌ర‌గ‌నుంది. నితిన్ గుంటూరు జిల్లా కలెక్ట‌ర్ పాత్ర‌లో వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. మాస్ యాక్ష‌న్ సీన్ల‌లో నితిన్ థియేట‌ర్ల‌ను షేక్ చేయ‌నున్నారు. నితిన్ డైలాగులు, ఫైట్స్ ఓ రేంజ్‌లో ఉండేలా చిత్రీక‌రించారు.

ప్ర‌తి నాయ‌కుడిగా ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని న‌టించారు.  ఈ సినిమాలో హీరోయిన్ క్యాథెరీన్ థ్రెసా కూడా న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన స్పెష‌ల్ సాంగ్ 'రా..రా..రెడ్డి' యూట్యూబ్‌లో దూసుకెళుతుంది. హీరోయిన్ అంజ‌లి నితిన్‌తో క‌లిసి 'రా..రా..రెడ్డి' పాట‌లో మాస్ డాన్సుల‌తో అల‌రించారు.

హీరో నితిన్ సొంత బ్యాన‌ర్ శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను నిర్మాత‌లు సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డీలు నిర్మిస్తున్నారు. 

Read More: Macherla Dhamki: నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' అదిరిపోయే ధమ్కీ వీడియో విడుదల.. ట్రైలర్ జులై30న!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!