Macherla Dhamki: నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' అదిరిపోయే ధమ్కీ వీడియో విడుదల.. ట్రైలర్ జులై30న!

Updated on Jul 26, 2022 03:08 PM IST
‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ‘మాచర్ల ధమ్కీ’ (Macherla Dhamki) అంటూ ఓ వీడియోని విడుదల చేశారు మేకర్స్‌.
‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ‘మాచర్ల ధమ్కీ’ (Macherla Dhamki) అంటూ ఓ వీడియోని విడుదల చేశారు మేకర్స్‌.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ (Nithiin), కృతీశెట్టి (Krithi Shetty) జంటగా ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ తొలిసారిగా నటిస్తున్న పూర్తి స్థాయి మాస్ ఓరియంటెడ్ యాక్షన్ సినిమా ఇది. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ స్వ‌రాల‌ను స‌మ‌కూర్చిన ఈ చిత్రంలో, అంజలి ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. ఈ చిత్రం ఆగస్ట్‌ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో, తాజాగా ‘మాచర్ల ధమ్కీ’ (Macherla Niyojakavargam Dhamki) అంటూ ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేశారు మేకర్స్‌. ఈ చిత్రంలోని మంచి యాక్షన్ సన్నివేశాలతో ఒక చిన్న గ్లింప్స్‌ను రూపొందించి, ఫ్యాన్స్ కోసం వీడియో రూపంలో రిలీజ్ చేశారు. అదిరిపోయే డైలాగ్స్, అద్భుతమైన యాక్షన్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు మరింత బలాన్నిచ్చాయి.

ఈ వీడియోలో సంభాషణలు కూడా విభిన్నంగా ఉన్నాయి.  ‘మ‌హాభార‌తంలో ధ‌ర్మాన్ని కాపాడ‌టం కోసం, ల‌క్ష‌లాది మంది త‌మ స‌మాధుల‌ను పునాదులుగా వేశారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ధ‌ర్మాన్ని కాపాడటం కోసం, నా స‌మాధిని పునాదిగా వేయ‌డానికి నేను సిద్ధం’ అంటూ నితిన్ (Hero Nithiin) ప‌లికే డైలాగ్స్‌ చాలా పవర్ ఫుల్‌గా ఉన్నాయి. ఈ డైలాగ్స్ కథానాయకుడి పాత్రని ఎలివేట్ చేయడమే కాకుండా, సినిమాపై మరింత క్యూరీయాసిటీని పెంచడం విశేషం. 

మాచర్ల నియోజకవర్గం’ యాక్షన్ ధమ్కీ సృష్టించిన మాస్ మానియా అంతా కాదు. ఈ ఫీవర్ నుండి ప్రేక్షకులు బయటకు రాకముందే... ఈ నెల 30న గుంటూరులో జరిగే భారీ పబ్లిక్ ఈవెంట్‌ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయని టాక్.  ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను (Macherla Niyojakavargam Trailer) చిత్ర బృందం అదే రోజున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  

Read More: ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ నుంచి 'అదిరిందే పసిగుండే' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!