బన్నీ (Allu Arjun) పెద్ద హీరో అవుతాడని ఆయన ముందే చెప్పారు: ‘తోడేలు’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్

Updated on Nov 19, 2022 05:50 PM IST
‘తోడేలు’ చిత్రంలో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని.. ఈ కథ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు
‘తోడేలు’ చిత్రంలో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని.. ఈ కథ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు

కన్నడలో సంచలన హిట్‌గా నిలిచిన ‘కాంతార’ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి హిట్ కొట్టారు నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind). ఎవరూ ఊహించని విధంగా తెలుగులో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిందీ చిత్రం. తెలుగులో రిలీజైన తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో మరో పరభాషా మూవీని ఇక్కడికి తీసుకొస్తున్నారు అల్లు అరవింద్.

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, క్యూట్ బ్యూటీ కృతీ సనన్ నటిస్తున్న ‘భేడియా’ సినిమాను తెలుగులో ‘తోడేలు’ పేరుతో డబ్ చేశారు. పౌర్ణమి రోజున హీరోను ఒక తోడేలు కరుస్తుంది. అప్పటి నుంచి ఆయన ప్రతి పౌర్ణమి రాత్రికి తోడేలుగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఈ లైన్ మీద ఆధారపడి కథంతా నడుస్తుంది. ఈ మూవీని తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. 

 ‘తోడేలు’ చిత్రంలో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని అల్లు అరవింద్ అన్నారు

తాజాగా ‘తోడేలు’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మంచి సినిమా ఏ భాషకు ఎక్కడున్నా మనం ప్రేమిస్తామని అన్నారు. ‘బాహుబలి సినిమా నుంచి చిత్ర పరిశ్రమలో సౌత్, నార్త్ అనే ఎల్లలు చెదిరిపోయాయి. నార్త్‌లో బాగున్న సినిమా ఇక్కడ ఆడుతుంది. సౌత్‌లో తీసిన సినిమా బాగుంటే నార్త్‌లో ఆడుతుంది. మంచి సినిమా ఎక్కడున్నా దాన్ని తెలుగు ప్రేక్షకులు ప్రేమిస్తారు, చూస్తారు. ఇది మన సంస్కృతిగా మారింది’ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. 

‘తోడేలు చిత్ర నిర్మాత దినేశ్ గారు మూడేళ్ల కింద బన్నీ (Allu Arjun)తో సినిమా తీయడానికి వచ్చారు. అల్లు అర్జున్ పెద్ద స్టార్ అవుతాడని అప్పుడు చెప్పారు. ఆయన నమ్మకం ‘పుష్ప’ మూవీ ద్వారా నిరూపితమైంది. భవిష్యత్తులో ఆయన బన్నీతో ఓ చిత్రం చేయాలని కోరుకుంటున్నా. వరుణ్ ధావన్ గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తే.. డబ్ చేసి ఆలిండియా రిలీజ్ చేయాలనుంది’ అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. గ్లామర్, యాక్టింగ్ రెండూ ఉన్న హీరోయిన్ కృతి అని ఆయన మెచ్చుకున్నారు. ‘తోడేలు’ చిత్రంలో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని.. ఈ కథ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని అల్లు అరవింద్ చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్నారు.  

Read more: చిరంజీవి (Chiranjeevi) ఒక్కరే ఆదుకున్నారు.. మిగతా ఏ హీరోలు నాకు సాయం చేయలేదు: పావలా శ్యామల (Pavala Shyamala)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!