Macherla Niyojakavargam: హీరో నితిన్ (Nithiin) టీమ్ రియాక్ష‌న్.. ఫేక్ ట్వీట్ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు

Updated on Jul 28, 2022 03:11 PM IST
Macherla Niyojakavargam : నితిన్ (Nithiin), కృతిశెట్టి జంట‌గా న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది.
Macherla Niyojakavargam : నితిన్ (Nithiin), కృతిశెట్టి జంట‌గా న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది.

Macherla Niyojakavargam: టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) కొత్త సినిమా 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమాపై ఫేక్ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఎంఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరుతో ఫేక్ వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఫేక్ వార్త‌ల‌పై నితిన్ టీమ్ స్పందించింది. ద‌ర్శ‌కుడు ఎంఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరుతో ఫేక్ ట్వీట్లు క్రియేట్ చేశారంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఇలాంటి పుకార్లను ప్ర‌చారం చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరారు.

ఫేక్ వార్త‌లు న‌మ్మ‌కండి - ద‌ర్శ‌కుడు

ద‌ర్శ‌కుడు ఎంఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కొన్ని కులాల‌ను తిడుతూ పెట్టిన పోస్టులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. . అయితే అదంతా త‌ప్పుడు ప్ర‌చారం అని ద‌ర్శ‌కుడు ఎంఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

త‌న వ్య‌క్తిత్వం దెబ్బ‌తీసేలా కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఇలాంటి చ‌ర్య‌లు త‌నకు న‌ష్టం క‌లిగిస్తున్నాయ‌ని ఫిర్యాదు చేశారు. ఫేక్ వార్త‌ల‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం రిలీజ్ ఎప్పుడంటే

నితిన్ (Nithiin), కృతిశెట్టి జంట‌గా న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది. హీరో నితిన్ సొంత బ్యాన‌ర్ శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను నిర్మాత‌లు సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డీలు నిర్మిస్తున్నారు. హీరోయిన్ అంజ‌లి ఓ స్పెష‌ల్ పాట‌లో న‌టించారు.

నితిన్ క‌లెక్ట‌ర్ పాత్ర‌లో వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. పొలిటిక‌ల్ నేప‌ధ్యంలో 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమాను నిర్మించారు. ప్ర‌తి నాయ‌కుడిగా ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని న‌టించారు. ఈ సినిమాలో హీరోయిన్ కేథ‌రిన్ థ్రెసా కూడా  న‌టించారు.

Read More: Macherla Dhamki: నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' అదిరిపోయే ధమ్కీ వీడియో విడుదల.. ట్రైలర్ జులై30న!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!