Karthikeya 2: 'కార్తికేయ 2'కు దిల్ రాజు 'థ్యాంక్యూ' ! .. సారీ చెప్పిన నిఖిల్ (Nikhil Siddharth) !

Updated on Jul 13, 2022 01:18 PM IST
Karthikeya 2: త‌న సినిమా కోసం ముందే టికెట్ బుక్ చేసుకున్న వారి డ‌బ్బులు వెన‌క్కి ఇచ్చేశామని నిఖిల్ తెలిపారు.
Karthikeya 2: త‌న సినిమా కోసం ముందే టికెట్ బుక్ చేసుకున్న వారి డ‌బ్బులు వెన‌క్కి ఇచ్చేశామని నిఖిల్ తెలిపారు.

టాలీవుడ్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) వ‌రుస సినిమాలతో దూసుకెళుతున్నారు. నిఖిల్ న‌టించిన‌ 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2'ను తెర‌కెక్కించారు. కానీ 'కార్తికేయ 2' విడుద‌ల‌కు మాత్రం ముహుర్తం కుద‌ర‌డం లేదు. 'కార్తికేయ 2' సినిమాను వాయిదా వేశారు. నాగ చైత‌న్య సినిమా కోసం నిఖిల్ సినిమాను వాయిదా వేసుకున్నారా?. ఇందులో నిజ‌మెంత‌?.

వాయిదాపై నిఖిల్ ట్వీట్
'కార్తికేయ 2' సినిమాను మొద‌ట జూలై 22న రిలీజ్ చేయాల‌నుకున్నారు. ఈ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ముంద‌స్తు బుకింగ్స్ కూడా చేసుకున్నారు. కానీ నిఖిల్ పెట్టిన పోస్ట్ అంద‌రిని ఆశ్య‌ర్య ప‌రిచింది. 'కార్తికేయ 2' చిత్రం జూలై 22 న విడుద‌ల చేయ‌డం లేద‌ని.. ఆగ‌స్టు మొద‌టి వారంలో రిలీజ్ కానుంద‌ని నిఖిల్ తెలిపారు. నిఖిలే స్వ‌యంగా ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. త‌న సినిమా కోసం ముందే టికెట్ బుక్ చేసుకున్న వారి డ‌బ్బులు వెన‌క్కి ఇచ్చేశామ‌ని నిఖిల్ తెలిపారు.

కార్తికేయ 2 కు థ్యాంక్యూ
నాగ‌చైత‌న్య (Naga Chaitanya) సినిమా 'థ్యాంక్యూ' కూడా మొద‌ట జూలై 8 న రిలీజ్ కావాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల‌తో జూలై 22న విడుద‌ల అవుతోంది. 'థ్యాంక్యూ' సినిమా నిర్మాత‌గా దిల్ రాజు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 'కార్తికేయ 2' చిత్రాన్ని వాయిదా వేసుకోవాల‌ని దిల్ రాజు కోరార‌ట‌.

బ‌డా నిర్మాత దిల్ రాజు రిక్వెస్ట్‌ను నిఖిల్ (Nikhil Siddharth) ఒప్పుకోకుండా ఎలా ఉంటారు? అందుక‌నే నిఖిల్ త‌న సినిమా విడుద‌ల‌ను పోస్ట్ పోన్ చేసుకున్నార‌ట‌.  నిఖిల్‌కు బ‌డా నిర్మాత దిల్ రాజు 'ధ్యాంక్యూ' సినిమాతో థ్యాంక్యూ చెబుతుంటే.. 'కార్తికేయ 2' కోసం ముంద‌స్తు బుకింగ్స్ చేసుకున్న ప్రేక్ష‌కుల‌కు నిఖిల్ సారీ చెబుతున్నారు. 

డైరెక్టర్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో 'కార్తికేయ 2' తెర‌కెక్కింది. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌లు జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

డాక్ట‌ర్ కార్తికేయ పాత్ర‌లో నిఖిల్ వెండితెర‌పై స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు. శ్రీకృష్ణుడి చరిత్రకు సంబంధించిన విష‌యాలు ఈ చిత్రంలో ప్ర‌త్యేకంగా క‌నిపించ‌నున్నాయి. కాలభైరవ సంగీతం స‌మ‌కూర్చారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు.

ఆగ‌స్టు ఫ‌స్ట్ వీక్ సినిమాలు
ఆగ‌స్టు మొదటి వారంలో నిఖిల్ (Nikhil Siddharth) 'కార్తికేయ 2' సినిమాతో పాటు కళ్యాణ్‌ రామ్ 'బింబిసార', దుల్కర్ సల్మాన్ 'సీతారామం', సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఏ సినిమా ఎంత క‌లెక్ష‌న్లు రాబ‌డుతుందో చూడాలి. 

Read More: Karthikeya 2 Movie: 'కార్తికేయ 2' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సరదా సన్నివేశం.. అభిమానికి నిఖిల్ బహుమతి!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!