Thank You Movie: లైఫ్‌లో లవ్ స్టోరీలు బాగా నడుస్తున్నాయా? - నాగ చైత‌న్య (Naga Chaitanya)

Updated on Jun 28, 2022 01:28 PM IST
కాలేజ్ లైఫ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక జీవితం ఓ రేస్‌లా ఉంటుంద‌ని నాగ చైత‌న్య  (Naga Chaitanya) అన్నారు.
కాలేజ్ లైఫ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక జీవితం ఓ రేస్‌లా ఉంటుంద‌ని నాగ చైత‌న్య (Naga Chaitanya) అన్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైత‌న్య  (Naga Chaitanya) ప్ర‌స్తుతం యూత్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌నున్నారు. ఆయన నటించిన థ్యాంక్యూ సినిమా నుంచి ఇటీవలే ఫేర్ వెల్ పాట‌ను లాంచ్ చేశారు. మ‌ల్లారెడ్డి కాలేజ్‌లో స్టూడెంట్స్ మ‌ధ్య 'థ్యాంక్యూ' సినిమా ఫేర్ వెల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌కు కాలేజీ స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సందర్భంగా యువ‌త అడిగిన ప్ర‌శ్న‌ల‌కు హీరో నాగ చైత‌న్య ఆసక్తిక‌ర‌మైన స‌మాధానాలు ఇచ్చారు. కాలేజ్ రోజుల్లో త‌న ప్రేమ విష‌యాన్ని కూడా చైత‌న్య బ‌య‌ట‌పెట్టేశారు.

నా కాలేజ్ లైఫ్ గుర్తొస్తుంది - నాగ చైత‌న్య‌
'థ్యాంక్యూ' మూవీ నుంచి ఫేర్ వెల్ సాంగ్‌ను హైద‌రాబాద్‌లోని మ‌ల్లా రెడ్డి కాలేజ్‌లో రిలీజ్ చేశారు. కాలేజ్  జీవితం గురించి నాగ‌చైత‌న్య (Naga Chaitanya) ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. అమ్మాయిలంతా అందంగా కనిపిస్తున్నారన్నారు. 'బాయ్స్.. బాగున్నారా? అందరూ బాగా చదువుకుంటున్నారా?' అంటూ ప‌ల‌క‌రించారు. 'అందరూ అల్లరి చేస్తున్నారా? లైఫ్‌లో లవ్ స్టోరీలు బాగా నడుస్తున్నాయా?' అని చై స‌ర‌దాగా మాట్లాడారు. త‌న‌కు త‌న‌ కాలేజ్ లైఫ్ గుర్తుకు వస్తుందని స్టూడెంట్స్‌తో అన్నారు చై. 

 నాగ‌చైత‌న్య (Naga Chaitanya) థ్యాంక్యూ సినిమా జూలై 22న రిలీజ్ కానుంది.

ప్రేమ గురించి ఓపెన్ అయిన చై
కాలేజ్‌ రోజుల్లో చ‌దువు ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా.. అనుకునేవాడిన‌ని చై  (Naga Chaitanya) అన్నారు. కాలేజ్ త‌ర్వాత త‌న కెరీర్ వైపు త్వ‌ర‌గా వెళ్లాలి అనుకునే వాడిన‌న్నారు. 'ప్రేమ గురించి ఎప్పుడు ఇంట్లో చెప్పాలా.. అని ఆలోచించేవాడిన‌న్నారు. కాలేజ్ లైఫ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక జీవితం ఓ రేస్‌లా ఉంటుంద‌న్నారు. ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లుంటాయ‌'న్నారు చై. వాటిని అధిగ‌మించ‌డానికి ఆలోచించే టైం కూడా ఉండ‌ద‌న్నారు.

కాలేజ్‌లో ఏదైతే నేర్చుకుంటామో, అదే జీవితంలో ముందుకు న‌డిపిస్తుంద‌న్నారు. కాలేజ్‌లో లెక్చ‌రర్లు చెప్పే మంచి విష‌యాలు జీవితంలో క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు గుర్తుకొస్తాయ‌న్నారు. 'కాలేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి' అని యువ‌త‌కు నాగ చైత‌న్య‌ స‌ల‌హా ఇచ్చారు. 
 
'థ్యాంక్యూ' సినిమాని యువ‌త‌కు న‌చ్చే విధంగా తెర‌కెక్కించామ‌ని నాగ చైత‌న్య తెలిపారు. యూత్ 'థ్యాంక్యూ' సినిమా చూసి వాళ్ల అభిప్రాయాన్ని చెప్పాల‌న్నారు. థ్యాంక్యూ సినిమా తెర‌కెక్కించేందుకు మూడేళ్లు స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతో క‌ష్ట‌ప‌డింద‌న్నారు. అంద‌రూ 'థ్యాంక్యూ' సినిమా చూసి ఎంజాయ్ చేయాల‌ని నాగ చైత‌న్య కోరారు. 

సినిమా రిలీజ్ తేదీలో మార్పు
నాగ చైత‌న్య న‌టిస్తున్న 'థ్యాంక్యూ' సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త‌మ‌న్ 'థ్యాంక్యూ' సినిమాకు సంగీతం అందించారు. చంద్ర‌బోస్ లిరిక్స్ రాశారు. 'థ్యాంక్యూ' సినిమాను ముందు జూలై 8న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ విడుద‌ల తేదీని మార్చారు. ఈ సినిమా జూలై 22న రిలీజ్ కానుంది. 

Read More: నాగ చైతన్యతో 'శోభిత ధూళిపాళ‌' డేటింగ్‌ ! అయితే స‌మంత (Samantha) కు ఎందుకంత కోపం ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!