Karthikeya 2 : 'పుష్ప' తర్వాత నార్త్‌లో 'కార్తికేయ 2' కలెక్షన్ రికార్డు సృష్టిస్తుందా?.. 50 నుంచి 1000 స్క్రీన్లలో
Karthikeya 2: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) నటించిన 'కార్తికేయ 2' చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఆగస్టు 13న రిలీజ్ అయింది. హిందీ వర్షన్ రిలీజ్ అయినప్పటి నుంచి రోజు రోజుకు స్క్రీన్ల సంఖ్య పెరగడం విశేషం. పాన్ ఇండియా సినిమా 'కార్తికేయ 2'తో నిఖిల్ పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు పొందారు. ఈ సినిమా సౌత్ కంటే నార్త్‌లో మంచి బిజినెస్ చేయనుందా?.
నార్త్‌లో పెరిగిన స్కీన్ల సంఖ్యతో
'కార్తికేయ 2' (Karthikeya 2) సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సముద్రంలో కృష్ణుడికి సంబంధించిన ద్వారకా నగర రహస్యాల కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ 'కార్తికేయ 2' సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా హిందీ వర్షన్‌లో రోజు రోజుకు స్క్రీన్ల సంఖ్య పెరుగుతుండటం విశేషం. బాలీవుడ్‌లో 'కార్తికేయ2' చిత్రం మొదటి రోజు 50 స్క్రీన్‌లలో విడుదలైంది. రెండో రోజు నుంచి స్క్రీన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం వేయి స్క్రీన్లలో 'కార్తికేయ 2' నార్త్ ఇండియాలో ప్రదర్శితమవుతోంది.
అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నేట్టేసి 'కార్తికేయ 2' నార్త్‌లో దుమ్ము లేపుతోంది. బలమైన కథతో 'కార్తికేయ 2' మంచి కలెక్షన్ రాబడుతుంది. ఈ సినిమా సక్సెస్‌తో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. 'బాహుబలి', 'పుష్ఫ' తర్వాత ఆ రేంజ్‌లో 'కార్తికేయ 2' సినిమాకు నార్త్‌లో డిమాండ్ ఏర్పడింది. నిఖిల్‌కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ నటించి మెప్పించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
Read More: Karthikeya 2: 'కార్తికేయ 2' దర్శకుడిని ప్రశంసించిన అమితాబ్ బచ్చన్