'కార్తికేయ 2' (Karthikeya 2) షూటింగ్ ఎలా సాగిందంటే.. మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన మేక‌ర్స్

Updated on Aug 12, 2022 07:45 PM IST
'కార్తికేయ 2' (Karthikeya 2) నుంచి విడుద‌లైన మేకింగ్ వీడియో ఆస‌క్తిగా సాగింది. మంచు కొండ‌ల్లో జ‌రిగిన‌ షూటింగ్ వండ‌ర్‌గా అనిపించింది.
'కార్తికేయ 2' (Karthikeya 2) నుంచి విడుద‌లైన మేకింగ్ వీడియో ఆస‌క్తిగా సాగింది. మంచు కొండ‌ల్లో జ‌రిగిన‌ షూటింగ్ వండ‌ర్‌గా అనిపించింది.

Karthikeya 2: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) న‌టించిన 'కార్తికేయ 2' ఎట్ట‌కేల‌కు విడుద‌ల కానుంది. 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కించిన 'కార్తికేయ 2' ఆగ‌స్టు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. బ‌డా హీరోలు త‌న సినిమాను అడ్డుకోవాల‌ని చూశార‌ని నిఖిల్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే సృష్టించాయి. 'కార్తికేయ 2' సినిమా నుంచి మేక‌ర్స్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. 

'కార్తికేయ 2' మేకింగ్ వీడియో

నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన చిత్రం 'కార్తికేయ 2' (Karthikeya 2). చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా నుంచి విడుద‌లైన మేకింగ్ వీడియో ఆస‌క్తిగా సాగింది. మంచు కొండ‌ల్లో జ‌రిగిన‌ సినిమా షూటింగ్ విజువ‌ల్స్ వండ‌ర్‌గా అనిపించాయి. 'కార్తికేయ 2' చిత్ర యూనిట్ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డార‌నే విష‌యం ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపించింది.

మైథలాజికల్ సినిమాగా 'కార్తికేయ 2'పై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. 'కార్తికేయ 2' (Karthikeya 2) సినిమా టికెట్లు ఓ రేంజ్‌లో బుక్ అవుతున్నాయి. 'కార్తికేయ 2' ప్ర‌మోష‌న్ల‌లో నిఖిల్, అనుప‌మా బిజీగా ఉన్నారు. త‌మదైన శైలిలో ప్ర‌మోష‌న్లు చేస్తూ సినిమాపై ఆస‌క్తి పెంచుతున్నారు. 

ఐదు భాష‌ల్లో రిలీజ్ కానున్న‌ కార్తికేయ 2

సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగర ర‌హ‌స్యాలపై తెర‌కెక్కిన సినిమాగా 'కార్తికేయ 2' ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్టు 13 తేదిన రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయ‌నున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

'కార్తికేయ 2' (Karthikeya 2)  సినిమాకు కాల‌భైర‌వ సంగీతం అందించారు. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ ముఖ్యపాత్రల్లో న‌టించారు.

Read More: Karthikeya 2: నిఖిల్ హీరోగా నటిస్తున్న 'కార్తికేయ 2'కు వినూత్న ప్రచారం.. కాంటెస్ట్ గెలిస్తే రూ.6లక్షలు నజరానా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!