Karthikeya 2: 'కార్తికేయ 2' వ‌సూళ్లు మాములుగా లేవుగా!.. 100 కోట్లను కొల్ల‌గొట్ట‌నున్న నిఖిల్ సినిమా!!

Updated on Aug 24, 2022 04:36 PM IST
Karthikeya 2: క‌లెక్ష‌న్ల ప‌రంగా 'కార్తికేయ 2' రికార్డులు సృష్టిస్తోంది. ఏకంగా వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల దిశ‌గా దూసుకుపోతుంది. 
Karthikeya 2: క‌లెక్ష‌న్ల ప‌రంగా 'కార్తికేయ 2' రికార్డులు సృష్టిస్తోంది. ఏకంగా వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల దిశ‌గా దూసుకుపోతుంది. 

Karthikeya 2: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) న‌టించిన మైథలాజికల్ థ్రిల్లర్ 'కార్తికేయ 2', ఈ  చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ద‌ర్శ‌కుడు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలైంది. ఐదు భాష‌ల్లో ఆగ‌స్టు 13న రిలీజ్ అయ్యి, ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ సినిమా హిందీ వ‌ర్ష‌న్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఉత్తరాదిలో స్క్రీన్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా 'కార్తికేయ 2 ' కొత్త రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే  రూ. 100 కోట్ల క్లబ్బులో చేరేందుకు సిద్ధంగా ఉంది. 

కార్తికేయ 2 వ‌సూళ్లు

ద్వార‌కా న‌గ‌ర‌ ర‌హ‌స్యాలను చేధించే ఓ యువకుడి కథే ఈ  'కార్తికేయ 2' (Karthikeya 2). ముఖ్యంగా కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ సినిమాను తెర‌కెక్కించారు. అలాగే, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇస్కాన్ ఆలయంలో నిర్వహించారు. పురాణాలలో కూడా సైన్స్‌కు సంబంధించిన అంశాలను ఉన్నాయని తెలియజేయడమే ఈ సినిమా ప్రత్యేకత.  

'కార్తికేయ 2'తో నిఖిల్ పాన్ ఇండియా లెవ‌ల్‌లో గుర్తింపు పొందారు. ఈ సినిమా సౌత్‌తో పాటు నార్త్‌లోనూ క‌లెక్ష‌న్ల మోత మోగిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు కార్తికేయ 2 రూ. 73.33 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. త‌మ సినిమా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. హీరో నిఖిల్ కెరీర్లోనే అధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా కార్తికేయ 2 నిలిచింది. 

నిఖిల్‌కు భారీ హిట్ ఇచ్చిన కార్తికేయ 2

'కార్తికేయ 2' సినిమా అంచనాలకు మించి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 10 రోజుల్లో ఈ సినిమా రూ. 36.73 కోట్లు క‌లెక్ష‌న్ వ‌సూళ్లు చేసింది. బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌తో దూసుకుపోతూ కార్తికేయ 2 ప‌ది రోజుల్లో రూ. 25.43 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. ఇక ముందు ముందు కార్తికేయ 2 సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. భారీ వ‌సూళ్ల నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. స‌క్సెస్ పార్టీల‌లో మునిగి తేలుతున్నారు. 

Read More: 'కార్తికేయ 2' (Karthikeya 2) షూటింగ్ ఎలా సాగిందంటే.. మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన మేక‌ర్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!