'కార్తికేయ 2' రిలీజ్‌ను కొంద‌రు సినీ పెద్ద‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు : హీరో నిఖిల్ (Nikhil Siddharth)

Updated on Aug 02, 2022 05:51 PM IST
హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) న‌టించిన 'కార్తికేయ 2' సినిమా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది. 
హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) న‌టించిన 'కార్తికేయ 2' సినిమా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది. 

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) 'కార్తికేయ 2' రిలీజ్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. త‌న సినిమాను అడ్డుకోవాల‌ని కొంద‌రు సినీ పెద్ద‌లు ప్ర‌య‌త్నించార‌ని నిఖిల్ చెప్పారు. 'కార్తికేయ 2' సినిమాను అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌కు వాయిదా వేసుకోవాల‌ని త‌న‌ను కోరార‌న్నారు. నిఖిల్ న‌టించిన 'కార్తికేయ 2' సినిమా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది. 

ద్వారకా నగర ర‌హ‌స్యాల‌ను తెలిపే 'కార్తికేయ‌2'

నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) న‌టించిన 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2'ను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) న‌టిస్తున్నారు. కృష్ణుడు ఏలిన ద్వారకా నగర రహస్యాల నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు. కృష్ణుడికి సంబంధించిన‌ ప‌లు ఆస‌క్తిక‌రమైన స‌న్నివేశాల‌ను 'కార్తికేయ‌ 2'లో చిత్రీక‌రించారు. 

నా సినిమాను అడ్డుకోవాల‌ని చూశారు - నిఖిల్

'కార్తికేయ‌' సినిమా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రహస్యం చుట్టూ తిరుగుతుంది. మొద‌ట‌ 'కార్తికేయ‌ 2' చిత్రాన్ని జూలై 22 తేదిన ఐదు భాష‌ల్లో రిలీజ్ చేయాల‌నుకున్నారు.. కానీ ప‌లు కార‌ణాల‌తో సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.  సినిమా రిలీజ్ అవ్వ‌క‌పోవ‌డానికి హీరో నిఖిల్ చెప్పిన కార‌ణాలు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి.

'కార్తికేయ 2' సినిమా ఆగ‌స్టు 12న రిలీజ్ చేయ‌డం వెనుక ఎంతో కృషి దాగుంద‌ని నిఖిల్ చెప్పారు. త‌నకు సినిమా రిలీజ్ డేట్ అంత సుల‌భంగా దొర‌క‌లేద‌న్నారు. దీనికి సంబంధించిన కార‌ణాలను చెబుతూ నిఖిల్ ఎమోష‌న‌ల్ అయ్యారు. 'కార్తికేయ 2'ను ఆగ‌స్టులో విడుద‌ల కాకుండా చేయాలని కొందరు ప్ర‌య‌త్నించారని చెబుతూ నిజాలు బ‌య‌ట‌పెట్టారు. 

"మీ సినిమాకు థియేట‌ర్లు దొర‌క‌వు. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నెల‌లో రిలీజ్ చేయండి" అంటూ కొంద‌రు త‌న‌తో అన్నారని.. ఆ మాట‌లు త‌న‌ను ఎంతో బాధించాయ‌న్నారు నిఖిల్ (Nikhil Siddharth). త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు కాబ‌ట్టే.. త‌న సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చింద‌న్నారు. త‌న సినిమా రిలీజ్ అడ్డుకున్న‌ప్పుడు, వారం పాటు ఏడ్చాన‌ని నిఖిల్ తెలిపారు. 

హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) న‌టించిన 'కార్తికేయ 2' సినిమా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది. 

ఐదు భాష‌ల్లో రిలీజ్ కానున్న‌ కార్తికేయ 2

సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగర ర‌హ‌స్యాలపై తెర‌కెక్కిన సినిమాగా 'కార్తికేయ 2' ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్టు 12 తేదిన రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయ‌నున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 'కార్తికేయ 2' (Karthikeya 2)  సినిమాకు కాల‌భైర‌వ సంగీతం అందించారు. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ ముఖ్యపాత్రల్లో న‌టించారు.

Read More: Karthikeya 2: నిఖిల్ హీరోగా నటిస్తున్న 'కార్తికేయ 2'కు వినూత్న ప్రచారం.. కాంటెస్ట్ గెలిస్తే రూ.6లక్షలు నజరానా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!