Karthikeya 2 : స‌ముద్రం దాచుకున్న అతి పెద్ద ర‌హ‌స్యం ఈ ద్వార‌కా న‌గ‌రం - కార్తికేయ 2 మోషన్ పోస్టర్ విడుద‌ల‌

Updated on Jun 01, 2022 07:12 PM IST
Karthikeya 2 : కార్తికేయ‌2 ద్వార‌కా న‌గ‌ర ర‌హ‌స్యాల గురించి తెలిపే క‌థ‌గా సినిమా విడుద‌ల కానుంది.  జూలై 22న ఐదు భాష‌ల్లో కార్తికేయ‌2 రిలీజ్ కానుంది. 
Karthikeya 2 : కార్తికేయ‌2 ద్వార‌కా న‌గ‌ర ర‌హ‌స్యాల గురించి తెలిపే క‌థ‌గా సినిమా విడుద‌ల కానుంది.  జూలై 22న ఐదు భాష‌ల్లో కార్తికేయ‌2 రిలీజ్ కానుంది. 

Karthikeya 2 : కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ 2 తీస్తున్నారు. నిఖిల్ హీరోగా కార్తికేయ‌2తో మ‌రోసారి విజ‌యం సాధించేందుకు సిద్ధం అవుతున్నారు. కార్తికేయ‌2 నుంచి మోషన్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. స‌ముద్రం దాచుకున్న అతి పెద్ద ర‌హ‌స్యం ద్వార‌కా న‌గ‌రం అంటూ మోష‌న్ పోస్ట‌ర్ డైలాగులు ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి. స‌ముద్రంలో ద్వార‌కా న‌గ‌రాన్ని చూపించేలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తుంది. 

ద్వార‌కా న‌గ‌ర నేప‌థ్యంలో సాగే క‌థ‌గా కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాను తెర‌కెక్కించారు. చందూ మొండేటి  తెరకెక్కించిన కార్తికేయ విజయాన్ని సాధించింది. నిఖిల్ హీరోగా న‌టించిన ఆ సినిమా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు కార్తికేయ‌2లో ద్వార‌కా న‌గ‌ర ర‌హ‌స్యాల గురించి తెలిపే క‌థ‌గా సినిమా విడుద‌ల కానుంది. జూలై 22న ఐదు భాష‌ల్లో కార్తికేయ‌2 రిలీజ్ కానుంది. 


 

సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారక ర‌హ‌స్యాలు క‌నిపెట్టాడానికి నిఖిల్ ఓ షిప్‌లో బ‌య‌లుదేర‌తాడు. నిఖిల్ వెంట హీరోయిన్ అనుప‌మా కూడా ఉంది. ద్వార‌క ర‌హ‌స్యాలు ఏం క‌నిపెడ‌తార‌నే నేప‌థ్యంలో సినిమా క‌థ సాగుతుంది. కార్తికేయ 2 (Karthikeya 2)  సినిమాకు కాల‌భైర‌వ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!