Bimbisara: బింబిసార 2పై క్లారిటీ ఇచ్చిన‌ క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram).. పార్ట్ 2లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారా?.

Updated on Aug 10, 2022 04:38 PM IST
'బింబిసార' సినిమాకు సీక్వెల్‌గా 'బింబిసార 2' ను  క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) తెర‌కెక్కించ‌నున్నారు.
'బింబిసార' సినిమాకు సీక్వెల్‌గా 'బింబిసార 2' ను క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) తెర‌కెక్కించ‌నున్నారు.

టాలీవుడ్ హీరో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) 'బింబిసార' సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు మల్లిడి వశిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. విడుద‌ల‌కు ముందే 'బింబిసార' పార్ట్ 2 ఉంటుంద‌ని క‌ల్యాణ్ రామ్ తెలిపారు. ఆ సినిమాలో త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంద‌న్నారు. ప్ర‌స్తుతం 'బింబిసార 2' సినిమాపై క‌ల్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి.

'బింబిసార 2' ఎలా ఉంటుందంటే..

'బింబిసార' చిత్రాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి, జగదేక వీరుడు లాంటి సినిమాల స్పూర్తితో తీశామ‌ని క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) తెలిపారు. మూడు రోజుల్లో 'బింబిసార' బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. 'బింబిసార' సినిమాకు సీక్వెల్‌గా 'బింబిసార 2' తెర‌కెక్కించ‌నున్నారు. 'బింబిసార 2' ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌లు పెట్ట‌నున్నారట‌. పార్ట్ 2 లో బింబిసారుడి గురించిన పూర్తి క‌థను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. బింబిసార ఎవ‌రు?. బింబిసార త‌మ్ముడిని ఎందుకు చంపాల‌నుకుంటాడు?. అస‌లు బింబిసార రాజు విల‌న్‌గా ఎందుకు మార‌డ‌నే క‌థ‌తో 'బింబిసార 2' చిత్రీక‌రించ‌నున్నారు. 'బింబిసార 2' విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయ‌ని క‌ల్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. 

'బింబిసార' చిత్రాన్ని మొత్తం నాలుగు భాగాలుగా నిర్మించనున్నారు.  ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై ఈ సినిమాను హ‌రికృష్ణ నిర్మిస్తున్నారు. ఫాంట‌సీ యాక్ష‌న్ నేప‌థ్యంలోనే మిగ‌తా మూడు భాగాలు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. 'బింబిసార‌'కు సీక్వెల్‌గా నిర్మించ‌బోయే సినిమాల్లో త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ న‌టించే అవ‌కాశం కూడా ఉందని కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సినిమా రిలీజ్‌కు ముందే తెలిపారు. 

Read More: బింబిసార (Bimbisara) సీక్వెల్‌లో నా త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంది : క‌ల్యాణ్ రామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!