Bimbisara: నంద‌మూరి వంశానికి  పాప సెంటిమెంట్ క‌లిసొచ్చిందా!.. 'బింబిసార' సక్సెస్‌కు అదే కార‌ణ‌మా?.

Updated on Aug 06, 2022 01:52 PM IST
Bimbisara: క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) న‌టించిన 'బింబిసార‌'లో కూడా పాప సెంటిమెంట్ ఉంది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది.
Bimbisara: క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) న‌టించిన 'బింబిసార‌'లో కూడా పాప సెంటిమెంట్ ఉంది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది.

Bimbisara: టాలీవుడ్ హీరో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram)  చాలా రోజుల త‌ర్వాత 'బింబిసార' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమాతో క‌ల్యాణ్ రామ్ స‌రికొత్త క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు. కొత్త ద‌ర్శ‌కుడు మల్లిడి వశిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఆగ‌స్టు 5న విడుద‌లైన ఈ చిత్రం వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. 'బింబిసార' స‌క్సెస్‌కు పాప సెంటిమెంట్ క‌లిసి వ‌చ్చింద‌నే టాక్ కూడా వినిపిస్తోంది. బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌తో పాటు క‌ల్యాణ్ రామ్‌కు కూడా పాప సెంటిమెంట్ క‌లిసి వ‌చ్చిందా? ఈ అంశం పై చిన్న విశ్లేషణ

చిన్నారి సెంటిమెంట్‌తో స‌క్సెస్!

బాల‌కృష్ణ న‌టించిన 'అఖండ' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణకు ఓ చిన్నారి పాత్రతో ఉన్న అనుబంధం ఈ సినిమాకు ప్ల‌స్‌గా నిలిచింది. 'అఖండ‌' సినిమాకు ఆ సెంటిమెంట్ సన్నివేశాలే బాగా క‌లిసి వ‌చ్చాయని చెబుతున్నారు  క్రిటిక్స్. 'అఖండ' త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన 'ఆర్.ఆర్.ఆర్'  చిత్రం రిలీజ్ అయింది. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌ను పోలిన పాత్రలో త‌న గోండు జాతికి చెందిన‌ మ‌ల్లి అనే చిన్నారిని కాపాడేందుకు పెద్ద సాహ‌స‌మే చేస్తారు. 

'ఆర్.ఆర్.ఆర్‌'లో ఎన్టీఆర్ చేసిన సాహసాలు, అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) న‌టించిన 'బింబిసార‌'లో కూడా పాప సెంటిమెంట్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. దీంతో నంద‌మూరి వంశానికి పాప సెంటిమెంట్ బాగా క‌లిసి వ‌చ్చిందంటూ కొంద‌రు నెటిజన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

హిట్ అందుకున్న క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) 

'బింబిసార' చిత్రంలో క‌ల్యాణ్ రామ్ త‌న న‌ట విశ్వ రూపం చూపించారు. తన యాక్ష‌న్‌తో పాటు, డైలాగుల‌తో అద‌ర‌గొట్టారు.  ఏడేళ్ల త‌ర్వాత క‌ల్యాణ్ రామ్‌ హిట్ అందుకున్న సినిమా 'బింబిసార‌'. 'ప‌టాస్' త‌ర్వాత క‌ల్యాణ్ రామ్‌కు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఇటీవ‌ల విడుద‌లైన సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార'తో మరోసారి క‌మ‌ర్షియ‌ల్ హిట్ సాధించారు. క‌ల్యాణ్ రామ్ తన త‌మ్ముడు ఎన్టీఆర్ చెప్పిన‌ట్టు 'బింబిసార' చిత్రంతో అభిమానుల‌ను కాల‌ర్ ఎగ‌రేసుకునేలా చేశారు. 

Read More: బింబిసార (Bimbisara) సీక్వెల్‌లో నా త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంది : క‌ల్యాణ్ రామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!