Bimbisara: ‘బింబిసార’ చిత్ర ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..

Updated on Aug 23, 2022 05:11 PM IST
Bimbisara: బింబిసార‌లో క‌ల్యాణ్ రామ్ న‌ట‌న ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్‌కు కూడా అంతే రేంజ్‌లో పేరు వ‌చ్చింది.
Bimbisara: బింబిసార‌లో క‌ల్యాణ్ రామ్ న‌ట‌న ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్‌కు కూడా అంతే రేంజ్‌లో పేరు వ‌చ్చింది.

Bimbisara: టాలీవుడ్ హీరో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) 'బింబిసార' సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు మల్లిడి వశిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ప్ర‌స్తుతం వ‌శిష్ట్ రెమ్యూన‌రేష‌న్‌ టాపిక్‌గా మారింది. కొత్త ద‌ర్శ‌కుడికి అన్ని కోట్ల రెమ్యూన‌రేషన్ ఇచ్చారా అంటూ గుసగుస‌లు వినిపిస్తున్నాయి. 

కొత్త డైరెక్ష‌న్ అదుర్స్ అంటూ ప్ర‌శంస‌లు

క‌ల్యాణ్ రామ్ న‌టించిన బింబిసార చిత్రం క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. కొత్త ద‌ర్శ‌కుడైన సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని మల్లిడి వశిష్ట్‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. మల్లిడి వశిష్ట్‌కు రూ. 3 కోట్లు చెల్లించార‌ట‌. బింబిసార మొత్తం నాలుగు భాగాలుగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాల‌కు మ‌ల్లిడి వ‌శిష్ట్ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌రించ‌నున్నారు. 

బింబిసార‌లో క‌ల్యాణ్ రామ్ న‌ట‌న ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్‌కు కూడా అంతే రేంజ్‌లో పేరు వ‌చ్చింది. మొద‌టి సినిమా అయినా కూడా వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో అద‌ర‌గొట్టారంటూ సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం వ‌శిష్ట్ బింబిసార స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. 

'బింబిసార' (Bimbisara) లో ముగ్గురు హీరోయిన్లు న‌టించారు. కేథరిన్,  సంయుక్త మీనన్, వార్నియా హుస్సేన్‌లు కథానాయిక పాత్రలు పోషించారు. అలాగే వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. 'బింబిసార' చిత్రం ఆగస్టు 5 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

Read More: బింబిసార (Bimbisara) సీక్వెల్‌లో నా త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంది : క‌ల్యాణ్ రామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!