Bimbisara Trailer: ‘బింబిసార’ ట్రైలర్ రిలీజ్..'శ‌ర‌ణు కోరితే ప్రాణ‌భిక్ష‌..ఎదిరిస్తే మ‌ర‌ణం' అంటున్న హీరో

Updated on Jul 27, 2022 06:29 PM IST
Bimbisara Trailer: 'బింబిసార' ట్రైల‌ర్‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. 'బింబిసార'  ఆగ‌స్టు 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Bimbisara Trailer: 'బింబిసార' ట్రైల‌ర్‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. 'బింబిసార' ఆగ‌స్టు 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Bimbisara Trailer: టాలీవుడ్ హీరో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) కొత్త సినిమా 'బింబిసార' నుంచి ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. 'బింబిసార' సినిమా ఆగ‌స్టు 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మ‌గ‌ధ రాజు బింబిసారుడిగా నందమూరి క‌ల్యాణ్ రామ్ వెండితెర‌పై తన అభిమానులకు కనువిందు చేయనున్నారు.

పేలుతున్న బింబిసార డైలాగులు

'బింబిసార‌..ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే టైటిల్‌తో రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుద‌లైన ట్రైల‌ర్‌లో క‌ల్యాణ్ రామ్ త‌న న‌ట విశ్వ‌రూపం చూపారు. 'బింబిసార' రాజుగా క‌ల్యాణ్ రామ్ డైలాగులు ట్రైల‌ర్‌లో పేలాయి. శ‌ర‌ణు కోరితే ప్రాణ‌భిక్ష‌..ఎదిరిస్తే మ‌ర‌ణం అనే డైలాగుల‌తో క‌ల్యాణ్ రామ్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను పెంచారు.

'హద్దులను చెరిపేస్తూ, మన రాజ్యపు సరిహద్దులు ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి' అనే బింబిసార‌ డైలాగుతో ట్రైల‌ర్ మొద‌లైంది. 'నాడైనా నేడైనా త్రిగర్తల చరిత్రను తాకలంటే... ఈ బింబిసారుడి కత్తిని దాటాలి' అని క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) మ‌రో జ‌న్మ‌లో చెప్పే డైలాగు ట్రైల‌ర్‌లో అదిరిపోయింది.

Bimbisara Trailer: 'బింబిసార' ట్రైల‌ర్‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. 'బింబిసార'  ఆగ‌స్టు 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్

'బింబిసార' నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్, పాట‌లు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 29న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ వేడుకకు నంద‌మూరి కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. 

'బింబిసార' (Bimbisara) లో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. కేథరిన్, సంయుక్త మీనన్, వార్నియా హుస్సేన్‌లు కథానాయిక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీల‌క పాత్ర‌లలో క‌నిపించ‌నున్నారు. మ‌ల్లాది వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. 'బింబిసార' చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. 'బింబిసార' చిత్రం ఆగస్టు 5 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

Read More: బింబిసార (Bimbisara) సీక్వెల్‌లో నా త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంది : క‌ల్యాణ్ రామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!