Bimbisara : 'బింబిసార' నుంచి 'నీతో ఉంటే చాలు' లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్

Updated on Aug 06, 2022 02:29 PM IST
Bimbisara : వశిష్ఠ దర్శకత్వంలో తెర‌కెక్కిన  'బింబిసార' ఆగ‌స్టు 5 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Bimbisara : వశిష్ఠ దర్శకత్వంలో తెర‌కెక్కిన 'బింబిసార' ఆగ‌స్టు 5 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Bimbisara : టాలీవుడ్ హీరో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) న‌టించిన సోషియో ఫాంట‌సీ చిత్రం 'బింబిసార' నుంచి కొత్త అప్‌డేట్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 'నీతో ఉంటే చాలు .. ' అంటూ సాగిన లిరిక‌ల్ వీడియో పాట‌ను విడుద‌ల చేశారు.

ఈ పాట‌ను సంగీత ద‌ర్శ‌కులు కీర‌వాణి రాయ‌డ‌మే కాకుండా.. స్వ‌రాలు కూడా స‌మ‌కూర్చారు. గాయ‌కులు మోహన భోగరాజు, శాండిల్య ఈ గీతాన్ని ఆలపించారు. వశిష్ఠ దర్శకత్వంలో తెర‌కెక్కిన  'బింబిసార' ఆగ‌స్టు 5 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

రీసెంట్‌గా 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా క‌ల్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ హాజ‌ర‌య్యారు. 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ (NTR) ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపారు.

'బింబిసార' కోసం త‌న అన్న‌య్య క‌ల్యాణ్‌రామ్ ర‌క్తాన్ని ధార‌పోశార‌న్నారు. అంతేకాదు 'బింబిసార' సినిమా కేవ‌లం క‌ల్యాణ్ రామ్‌తోనే సాధ్య‌మైందని అభిప్రాయపడ్డారు.  అభిమానులు కాల‌ర్ ఎగ‌రేసుకునేలా చేయ‌డ‌మే త‌మ బాధ్య‌త‌న్నారు ఎన్టీఆర్.

Bimbisara : వశిష్ఠ దర్శకత్వంలో తెర‌కెక్కిన బింబిసార సినిమా 'బింబిసార' ఆగ‌స్టు 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

'బింబిసార' (Bimbisara) లో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. కేథరిన్, సంయుక్త మీనన్, వార్నియా హుస్సేన్‌లు ఈ చిత్రంలో కథానాయిక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీల‌క పాత్ర‌లలో క‌నిపించ‌నున్నారు.

మ‌ల్లాది వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. 'బింబిసార' చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. 'బింబిసార' చిత్రం ఆగస్టు 5 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

Read More: బింబిసార (Bimbisara) సీక్వెల్‌లో నా త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంది : క‌ల్యాణ్ రామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!