కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) హీరోగా నటించిన ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎన్టీఆర్ (Junior NTR)

Updated on Jul 26, 2022 09:06 PM IST
కల్యాణ్‌రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ (Junior NTR)
కల్యాణ్‌రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ (Junior NTR)

కల్యాణ్‌రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ‘బింబిసార’. కల్యాణ్‌రామ్ కెరీర్‌‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ‘బింబిసార‘ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో జూలై 29వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించనున్నారు మేకర్స్.

‘బింబిసార‘ సినిమాలో నిర్మాత, హీరో నందమూరి కల్యాణ్‌రామ్, తన కెరీర్‌‌లో ఎప్పుడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌‌లో నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే ‘బింబిసార‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా, ఓ స్టార్ హీరో రానున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తోంది. కల్యాణ్‌రామ్‌ సోదరుడు, నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR)  ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని టాక్. ఈ విషయాన్ని ‘బింబిసార‘ సినిమా యూనిట్ అధికారికంగా కూడా ప్రకటించింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈనెల 29వ తేదీన ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది.

కల్యాణ్‌రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ (Junior NTR)

ఆకట్టుకుంటున్న టీజర్..

‘బింబిసార‘ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్ వస్తున్న క్రమంలో ఓ ప్రయోగాన్ని చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ సినిమాలో కొన్ని సన్నివేశాలు, ‘బింబిసార’లో కొన్ని సీన్లను కలిపి ఓ టీజర్ వీడియోను తయారుచేశారు.

తర్వాత అదే వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశారు మేకర్స్. భారీ యాక్షన్ నేపథ్యంలో  ప్రాచీన రాచరిక వ్యవస్థను ప్రతిబింబించే ‘బింబిసార’ సినిమాలో కల్యాణ్ రామ్ బింబిసారుడిగా, ఆధునిక యువకుడిగా రెండు విభిన్న పాత్రలలో కనిపిస్తున్నారు.

అంతేకాదు, ఈ ఈవెంట్‌కు రాజమౌళి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత ఎన్టీఆర్‌‌, రాజమౌళిల మధ్య గ్యాప్ వచ్చిందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ రూమర్లకు చెక్ పెట్టే దిశగా రాజమౌళి ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చే అవకాశం ఉందని టాక్. ‘బింబిసార’ మొదటి పార్ట్ హిట్ అయితే.. సీక్వెల్ కూడా తీయనున్నట్లు కల్యాణ్ రామ్ తెలిపారు.

‘బింబిసార‘ సినిమాకు నిర్మాతగా కల్యాణ్‌రామ్ (Kalyan Ram) భారీగానే ఖర్చు చేశారని, దీంతో తన అన్నయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ (Junior NTR)‌ హాజరై, ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రమోషన్స్‌కు తనవంతు సహకారం అందించాలని కోరుకుంటున్నారని టాక్.

Read More : నటనలో అక్షరాభ్యాసం చేసింది బాలకృష్ణ బాబాయ్‌ : వీడియో రిలీజ్ చేసిన కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!