సినారే జీవన సాఫల్య పుర‌స్కారం అందుకున్న నందమూరి బాల‌కృష్ణ‌ (Nandamuri Balarishna)

Updated on Jul 31, 2022 03:28 PM IST
సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం అందుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని బాల‌కృష్ణ (Nandamuri Balarishna) చెప్పారు.
సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం అందుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని బాల‌కృష్ణ (Nandamuri Balarishna) చెప్పారు.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balarishna) కు అరుదైన గౌరవం దక్కింది. బాల‌కృష్ణ‌ సినారే జీవన సాఫల్య  పురస్కారం అందుకున్నారు. ఈ అరుదైన పురస్కారం లభించడం పట్ల బాల‌కృష్ణ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో బాల‌కృష్ణ సినిమాల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. మాస్ యాక్ష‌న్ సినిమాల‌తో, భారీ డైలాగుల‌తో బాల‌కృష్ణ అద‌ర‌గొడ‌తారు. సాంఘికం, జానపదం, పౌరాణికం, భక్తిరసం, చారిత్రాత్మకం ఇలా అన్ని పాత్రల‌లో మెప్పించిన హీరో బాల‌కృష్ణ‌. ఎన్టీఆర్ కుమారుడిగా బాల‌కృష్ణ బాల న‌టుడుగా త‌న సినీ ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ఆ త‌ర్వాత క‌థానాయ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ స‌క్సెస్‌ఫుల్ హీరోగా కొన‌సాగుతున్నారు.

 

సినారే గొప్ప క‌వి - బాల‌కృష్ణ‌

మహా కవి సి. నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం అందుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని బాల‌కృష్ణ (Nandamuri Balarishna) చెప్పారు. సి. నారాయ‌ణ‌రెడ్డి వ‌ల్లే తాను న‌టుడు అయ్యాన‌ని బాల‌కృష్ణ చెప్పారు.

సాహిత్యాన్ని బ్రతికించిన వారిలో సినిరే ఒక‌ర‌ని బాల‌కృష్ణ అభిప్రాయ‌ప‌డ్డారు. త‌న‌లోని న‌టుడిని మొద‌ట‌గా గుర్తించిన వ్య‌క్తి సినారే అన్నారు. ఎన్టీఆర్, సినారే మంచి స్నేహితుల‌న్నారు. త‌న న‌ట‌న గురించి సినారే ఎన్టీఆర్‌కు చెప్పార‌న్నారు. న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తి త‌న తండ్రి ఎన్టీఆర్ సినారే వ‌ల్ల తెలుసుకుని.. సినిమా రంగంలోకి తీసుకొచ్చార‌ని బాల‌కృష్ణ గుర్తుచేసుకున్నారు. 

సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం అందుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని బాల‌కృష్ణ (Nandamuri Balarishna) చెప్పారు.

బిజీగా బాల‌కృష్ణ‌

అఖండ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ త‌ర్వాత బాల‌కృష్ణ (Nandamuri Balarishna) బ‌ల‌మైన క‌థ‌లున్న సినిమాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న ఎన్‌బీకే 107లో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం క‌ర్నూలులో జ‌రుగుతుంది. జై బాల‌య్య అనే టైటిల్ ఖార‌రు చేస్తార‌ని టాక్. బాల‌కృష్ణ త‌న 108వ సినిమాను ఎఫ్ 2 ఫేమ్ అనిల్ రావిపూడితో చేస్తున్నారు. 

Read More : బాల‌కృష్ణ (Balakrishna) సినిమాకు సై అంటున్న‌ బాలీవుడ్ హీరోయిన్!.. ఇదంతా అనిల్ రావిపూడి ప్లానేనా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!