మాస్ ఎంటర్‌‌టైనర్‌‌గా #NBK107 టీజర్ ! భయం నా బయోడేటాలోనే లేదు : బాలకృష్ణ (BalaKrishna)

Updated on Jun 09, 2022 09:53 PM IST
NBK107  లో బాలకృష్ణ (BalaKrishna)
NBK107 లో బాలకృష్ణ (BalaKrishna)

మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్..

భయం నా బయోడేటాలోనే లేదురా బోసీడీకే..

నరకడం మొదలుపెడితే.. ఏ పార్ట్‌ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు నా కొడకల్లారా!

తాజాగా రిలీజైన  #NBK107 టీజర్‌‌లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్‌ ఇవి.

నందమూరి నటసింహం బాలకృష్ణ (BalaKrishna). ఆయన ఏ సినిమా చేస్తున్నా దాని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారు. శుక్రవారం బాలకృష్ణ పుట్టినరోజు.

ఈ మధ్యనే అఖండ సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. ఆ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడని టాక్.

ప్రస్తుతం #NBK107 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్ మలినేని–బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ సినిమా టైటిల్‌ ఏంటి? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా టీజర్‌‌ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఫస్ట్‌ హంట్‌ లోడింగ్‌.. #NBK107 పోస్టర్‌‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ కూడా చేసింది. తాజాగా NBK107వ సినిమాకు సంబంధించిన టీజర్‌‌ను గురువారం సాయంత్రం 6:11 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్‌ ట్వీట్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

NBK107  లో బాలకృష్ణ (BalaKrishna)

మాస్ టీజర్..

ఒక నిమిషం రెండు సెకండ్ల  వ్యవధి ఉన్న టీజర్‌‌ను మేకర్స్ ఈ రోజే రిలీజ్ చేశారు. టీజర్‌‌లో బాలకృష్ణ బ్లాక్ షర్ట్‌లో పక్కా మాస్‌ లుక్‌లో కనిపించడం విశేషం.

చిత్తూరు జిల్లా పులిచర్ల 4 కిలోమీటర్ల మైలు రాయి మీద కూర్చున్న బాలయ్య.. దాని పక్కనే ఉన్న ఆర్చ్‌కు వేలాడుతూ కనిపించే డెడ్‌బాడీలు.. బాలయ్య చేతిలో కత్తి.. వీటన్నింటితో  కథలోని మాస్‌ ఎలివేషన్స్‌ను చూపించాడు దర్శకుడు. బాలయ్య తన డ్రెస్సింగ్, నడక, కంటి చూపు, డైలాగ్స్‌తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాడు.

ఈ టీజర్‌‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌ అదరగొట్టాడు. అఖండ సినిమాలో బాలకృష్ణకు గూస్‌బంప్స్ వచ్చే మ్యూజిక్ కొట్టిన థమన్.. ఈ సినిమా టీజర్‌‌లో మాస్ మ్యూజిక్‌తో అందరినీ ఉత్సాహపరిచాడు. టీజర్‌‌లోనే సినిమాలో బాలయ్య క్యారెక్టర్‌‌ ఎలా ఉండబోతోంది అనేది మనకు అర్ధమయ్యేలా చేశాడు మలినేని గోపీచంద్.

మొత్తానికి టీజర్ బాలయ్య అభిమానులకు నిజంగా బర్త్‌ డే కానుక అనే చెప్పాలి. అంతకుమించి మేకర్స్‌ ఇచ్చిన పోస్టర్‌‌లో 'ఫస్ట్‌ హంట్‌' అన్నట్టుగానే.. నిజంగానే మొదటి వేటలాగా అనిపిస్తోంది NBK107 ఫస్ట్‌ టీజర్.

ఇక,  ఈ సినిమా తర్వాత బాలకృష్ణ.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రియమణి, అంజలి నటించనున్నారని సమాచారం. కాగా, బాలయ్య – అనిల్‌ కాంబోలో వస్తున్న సినిమాలో బాలకృష్ణకు కూతురిగా పెళ్లిసందD హీరోయిన్‌ శ్రీలీల నటించనుందని తెలుస్తోంది.

తన సినిమాలో బాలయ్యను డిఫరెంట్‌గా చూపించబోతున్నట్టు అనిల్ రావిపూడి ఎఫ్‌3 ప్రమోషన్స్‌లో పలుసార్లు చెప్పాడు. ఇప్పటివరకు ఎవ్వరూ చూడని బాలకృష్ణను చూస్తారని తను చెప్పడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.  

Read More: ఫస్ట్ హంట్ లోడింగ్.. 'సింహం వేటకు సిద్ధం'.. అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!